Advertisement

  • బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తెచ్చిన రూ.6.86 లక్షల దోపిడీ

బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తెచ్చిన రూ.6.86 లక్షల దోపిడీ

By: chandrasekar Thu, 13 Aug 2020 5:56 PM

బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తెచ్చిన రూ.6.86 లక్షల దోపిడీ


బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తెచ్చిన రూ.6.86 లక్షల డబ్బులు దోపిడీ చేయబడిన సంఘటన బీహార్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేసేందుకు వెళ్లిన పెట్రోల్ బంక్ మేనేజర్‌ని కాల్చేసి డబ్బులు దోచుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే తుపాకీతో కాల్చేసి నగదు దోచుకెళ్లిన సంఘటన బిహార్‌ రాజధాని పట్నాలో చోటుచేసుకుంది. రామక్రిష్ణ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి అగంక్వాన్‌లోని సొనాలి పెట్రోల్ బంకులో మున్నా రాయ్(40) మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కలెక్షన్ డబ్బులు బ్యాంకులో జమ చేయుటకు పెట్రోల్ బంక్ నుండి బయలుదేరాడు.

పెట్రోల్ బంక్ మేనేజర్‌ బంకు నుండి తీసికొచ్చిన డబ్బులు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు మరో వ్యక్తితో కలసి వెళ్లాడు. బ్యాంకుకి చేరుకుని వాహనం పార్క్ చేస్తుండగా ఒక్కసారిగా గుర్తుతెలియని దుండగులు అతనిపై దాడి చేశారు. డబ్బులు లాక్కెళ్లేందుకు ప్రయత్నించడంతో మున్నా పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతనిపై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు బ్యాంకులో డిపాజిట్ చేసేందుకు తెచ్చిన రూ.6.86 లక్షలను దోచుకుని పారిపోయారు.

తుపాకీ కాల్పులు గాయాలతో పడి ఉన్న క్షతగాత్రుడిని సమీపంలోని ఆప్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉంది. పట్టపగలే దోపిడీ జరగడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని దోపీడీ జరిగిన తీరుపై ఆరా తీశారు. పార్కింగ్ వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. సంఘటన జరిగిన స్థలంలో వివరాలను సేకరిస్తున్నారు.

బ్యాంకులో కట్టడానికి డబ్బుతో బయల్దేరిన బంకు మేనేజర్‌ని మరో బైక్‌పై నిందితులు వెంబడించారని బంకులో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి వెనకే వచ్చారని ఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు. అయితే దోపిడీ దొంగలు మేనేజర్‌పై పలుమార్లు కాల్పులు జరిపారని స్పాట్‌లో ఒక్క ఖాళీ బుల్లెట్ మాత్రమే దొరకడంతో పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తి విచారణ జరపాల్సి వుంది.

Tags :

Advertisement