Advertisement

  • ముంబైలో మ‌హిళా ఖైదీలకు వాడే బైకులా జైలుకు రియా చ‌క్ర‌వ‌ర్తి

ముంబైలో మ‌హిళా ఖైదీలకు వాడే బైకులా జైలుకు రియా చ‌క్ర‌వ‌ర్తి

By: chandrasekar Thu, 10 Sept 2020 09:24 AM

ముంబైలో మ‌హిళా ఖైదీలకు వాడే బైకులా జైలుకు రియా చ‌క్ర‌వ‌ర్తి


ముంబైలో మ‌హిళా ఖైదీలకు వాడే బైకులా జైలుకు రియా చ‌క్ర‌వ‌ర్తిని తరలించారు. గడచినా కొద్దీ రోజులుగా రియా పై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతితో సంబంధం ఉన్న డ్ర‌గ్స్ కేసులో మంగ‌ళ‌వారం ముంబైలోని ఎన్‌సీబీ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తిని అరెస్టు చేసిన విష‌యం తెలిసిందే. అయితే రాత్రంతా ఎన్‌సీబీ ఆఫీసులో ఉన్న రియాను ఇవాళ ఉద‌యం బైకులా మ‌హిళా జైలుకు త‌ర‌లించారు.

ఆమెకు గ‌త రాత్రి బెయిల్ తిర‌స్క‌రించిన మెజిస్ట్రేట్ 14 రోజ‌ల రిమాండ్ విధించారు. అయితే ఇవాళ సెష‌న్స్ కోర్టులో రియా మ‌ళ్లీ బెయిల్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకునే అవ‌కాశాలు ఉన్నాయి. ముంబైలో మ‌హిళా ఖైదీల కోసం ఉన్న ఏకైక జైలు బైకులా. దీంట్లో హై ప్రొఫైల్ మ‌హిళా ఖైదీలు ఉన్నారు. షీనాబోరా హ‌త్య కేసు నిందితురాలు ఇంద్రాణి ముఖ‌ర్జీ, బీమాకోరేగావ్ కేసులో అరెస్టు అయిన సామాజిక కార్య‌క‌ర్త సుభా భ‌ర‌ద్వాజ్ ఈ జైలులోనే ఉన్నారు.

సుశాంత్ మరణంపై విచారణ తీవ్రతరం చేయడంతో డ్రగ్స్ గుట్టు బయట పడింది. త‌న బాయ్‌ఫ్రెండ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు రియా చ‌క్ర‌వ‌ర్తి డ్ర‌గ్స్ ఆర్గ‌నైజ్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ కేసును సీబీఐ కూడా విచారిస్తున్న‌ది. రియాపై నార్కోటిక్స్ చ‌ట్టంలోని ప‌లు సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. ఒక‌వేళ ఆ కేసుల్లో రియా దోషిగా తేలితే ఆమెకు క‌నీసం ప‌దేళ్ల జైలు శిక్ష ప‌డనున్నట్లు తెలిసింది. మూడు రోజుల విచార‌ణ త‌ర్వాత నిన్న రియాను అరెస్టు చేశారు.

Tags :

Advertisement