Advertisement

  • రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌ బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ముంబై ప్రత్యేక కోర్టు

రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌ బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ముంబై ప్రత్యేక కోర్టు

By: chandrasekar Sat, 12 Sept 2020 09:41 AM

రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌ బెయిల్ పిటిషన్లను తిరస్కరించిన ముంబై ప్రత్యేక కోర్టు


రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌ బెయిల్ పిటిషన్లను ముంబై ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ మరణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తి ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిఫి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రా బెయిల్ పిటిషన్లను ముంబై ప్రత్యేక కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో రియా చక్రవర్తి ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ కస్టడీపై బైకుల్లా జైలులో ఉండనున్నారు. సుశాంత్ మరణం కేసులో డ్రగ్స్ కోణంలో దర్యాప్తు చేస్తున్న మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) రియాను మూడు రోజులపాటు వరుసగా ప్రశ్నించిన అనంతరం ఈ నెల 9న అరెస్ట్ చేసింది. దీనికి ముందే ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి‌, సుశాంత్ మేనేజనర్ శామ్యూల్ మిరాండా, పని మనిఫి దీపేశ్ సావంత్, డ్రగ్స్ డీలర్లు అబ్దుల్ బాసిత్, జైద్ విలాత్రాను ఎన్సీబీ ప్రశ్నించి అరెస్ట్ చేసింది.

ఫోన్ లో దొరికిన ఆధారంగా సుశాంత్‌కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న సంగతిని గురించి దర్యాప్తులో వీరంతా అంగీకరించినట్లు సమాచారం. అయితే ఎన్సీబీ బలవంతంగా తమ నుంచి తప్పుడు స్టేట్‌మెంట్లను రికార్డు చేసిందని వారు ఆరోపించారు. మరోవైపు వీరి బెయిల్ పిటిషన్ల‌ను స్థానిక కోర్టు తిరస్కరించడంతో ఈ నెల 9న ముంబై ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. గురువారం నిందితులు, ఎన్సీబీ తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు.

కానీ నిందితులకు డ్రగ్స్‌తో సంబంధాలున్నాయని, బెయిల్‌‌పై వారిని విడుదల చేస్తే ఆధారాలు, సాక్ష్యాలను నాశనం చేస్తారని కోర్టుకు ఎస్సీబీ తెలిపింది. దీంతో దర్యాప్తు పూర్తయ్యేంత వరకు వారిని కస్టడీలోనే ఉంచాలని కోరింది. ఇరువైపులా వాదనలు విన్న ముంబై ప్రత్యేక కోర్టు వారి బెయిల్ పిటిషన్లు తిరస్కరిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. దీంతో రియా, ఆమె సోదరుడితో సహా మిగతా వారంతా జ్యుడిషియల్ కస్టడీపై జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags :

Advertisement