Advertisement

  • బెయిల్‌ కోసం మంగళవారం హైకోర్టును ఆశ్రయించిన రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు

బెయిల్‌ కోసం మంగళవారం హైకోర్టును ఆశ్రయించిన రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు

By: chandrasekar Wed, 23 Sept 2020 10:30 AM

బెయిల్‌ కోసం మంగళవారం హైకోర్టును ఆశ్రయించిన రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు


బెయిల్‌ కోసం మంగళవారం రియా చక్రవర్తి మరియు ఆమె సోదరుడు హైకోర్టును ఆశ్రయించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం తరువాత డ్రగ్స్‌ వ్యవహారంలో అరెస్టైన అతడి స్నేహితురాలు రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోయిక్‌ చక్రవర్తి బెయిల్‌ కోసం బాంబే హైకోర్టును మంగళవారం ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సుశాంత్‌ మరణం కేసును సీబీఐ దర్యాప్తు చేస్తుండగా, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ జరుపుతున్నది.

బాలీవుడ్ లో కలకలం రేపిన డ్రగ్స్ కేసులో రియాపై దర్యాప్తు చేపట్టిన మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ (ఎన్సీబీ) ఆమె మరియు ఆమె సోదరుడు షోయిక్‌ చక్రవర్తి, మేనేజర్‌ శ్యాముల్‌, పని మనిషి దీపేష్‌తోపాటు ఇద్దరు డ్రగ్స్‌ డీలర్లను సుదీర్ఘంగా ప్రశ్నించి అరెస్ట్‌ చేసింది. ఎన్సీబీ ప్రత్యేక కోర్టు రియాకు 14 రోజులపాటు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధించగా మంగళవారంతో అది ముగిసింది.

కానీ ఈ కేసులో ఆమె జ్యుడిషియల్‌ రిమాండ్‌ను అక్టోబర్‌ 6 వరకు ఎన్డీపీఎస్‌ కోర్టు పొడిగించింది. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు బెయిల్‌ కోసం బాంబై హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం దీనిపై విచారణ జరుగుతుందని రియా తరుఫు న్యాయవాది తెలిపారు. కాగా, షోయిక్‌ ఒక రోజు కస్టడీ కోసం కోర్టును ఎన్సీబీ కోరింది.

సినీ ఫీల్డ్ లో చాల సంచలనం రేపిన డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటి వరకు 18 మందిని అరెస్ట్‌ చేసింది. మరోవైపు సుశాంత్‌ మాజీ మేనేజర్‌ జయ షాను ఎన్సీబీ సోమవారం ప్రశ్నించింది. ఈ సందర్భంగా డ్రగ్స్‌ వ్యవహారంలో బాలీవుడ్‌ తారలు దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ పేర్లు బయటకు వచ్చినట్లు తెలుస్తున్నది. ఇంకా ఎంతమంది ఈ కేసులో బయట పడుతారో వేచి చూడాల్సిందే.

Tags :

Advertisement