Advertisement

  • బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం మరియు వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం మరియు వెండి ధరలు

By: chandrasekar Mon, 09 Nov 2020 3:26 PM

బులియన్ మార్కెట్‌లో పెరిగిన బంగారం మరియు వెండి ధరలు


దీపావళి దగ్గర పడుతుండడంతో బులియన్ మార్కెట్‌లో బంగారం మరియు వెండి ధరలు బాగా పెరిగాయి. బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్నాయి. బంగారం ధరలు పుంజుకోగా, వెండి సైతం పసిడి దారిలోనే పయనిస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్‌‌లలో బంగారం ధర రూ.440 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.52,380 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారంపూ రూ. 410 పెరగడంతో 10 గ్రాముల ధర రూ.48,020 వద్ద మార్కెట్ అవుతుంది. ఢిల్లీ మార్కెట్‌లో గత వారం రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై రూ.440 మేర పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.55,040 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.50,460కి చేరింది. బులియన్ మార్కెట్‌లో వెండి ధరలు వరుసగా పెరుగుతున్నాయి. దీంతో కేజీ వెండి ధర రూ.65 వేల మార్కు చేరుకుంది. తాజాగా మార్కెట్‌లో వెండి ధర రూ.900 మేర పెరిగింది. దీంతో ప్రస్తుతం 1 కేజీ వెండి ధర రూ.65,410 అయింది. దేశ వ్యాప్తంగా ఇదే ధరలో మార్కెట్ అవుతోంది. మార్కెట్ పుంజుకోవడంతో ధరలలో మార్పు కనిపిస్తూవుంది.

Tags :
|
|

Advertisement