Advertisement

  • అతడు అండర్ 19 లోనే బౌలర్లకు చుక్కలు చూయించాడు...రషీద్ ఖాన్

అతడు అండర్ 19 లోనే బౌలర్లకు చుక్కలు చూయించాడు...రషీద్ ఖాన్

By: Sankar Thu, 11 June 2020 07:47 AM

అతడు అండర్ 19  లోనే బౌలర్లకు చుక్కలు చూయించాడు...రషీద్ ఖాన్


భారత యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కి బౌలింగ్ చేయడం చాలా కష్టమని అఫ్గానిస్థాన్ అగ్రశ్రేణి స్పిన్నర్ రషీద్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ టెక్ట్స్ బుక్‌లోని ప్రతి షాట్‌ని పంత్ ఆడగలడని కితాబిచ్చిన రషీద్ ఖాన్.. అండర్ -19లోనే బౌలర్లకి అతను చుక్కుల చూపించినట్లు గుర్తు చేసుకున్నాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున రషీద్ ఖాన్ ఆడుతుండగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌కి రిషబ్ పంత్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికీ రషీద్ ఖాన్ ప్రత్యర్థిగా ఎదురుపడితే రిషబ్ పంత్ స్వేచ్ఛగా బ్యాట్ ఝళిపించేస్తుంటాడు.

rishab panth,rashid khan,india,afghanisthan,under 19 ,రషీద్ ఖాన్,   రిషబ్ పంత్‌, అఫ్గానిస్థాన్ , ఢిల్లీ క్యాపిటల్స్‌,  ఐపీఎల్‌


2016లో అండర్ -19 వరల్డ్‌కప్ జరగగా.. ఆ టోర్నీకి ఏడాది ముందు అఫ్గానిస్థాన్ యువ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో రిషబ్ పంత్ ఆకాశమే హద్దుగా చెలరేగినట్లు రషీద్ ఖాన్ గుర్తు చేసుకున్నాడు. టీమిండియా మణికట్టు స్పిన్నర్ చాహల్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో తాజాగా రషీద్ ఖాన్ మాట్లాడుతూ ‘‘ఆ మ్యాచ్‌లో పంత్ వరుసగా 6, 6, 6 బాదేశాడు. ఆ తర్వాత నాలుగో బంతికి కూడా సిక్స్ కొట్టాలని ప్రయత్నించాడు. కానీ.. ఆశించిన విధంగా బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దాంతో.. గాల్లోకి బంతి లేవగా.. షార్ట్ మిడ్‌వికెట్‌లో మా ఫీల్డర్ చేజార్చాడు. ఆ సీన్ చూసిన మా బౌలర్ తల పట్టుకుని మైదానంలోనే నిస్సహాయ స్థితిలో కూర్చిండిపోయాడు. క్రికెట్ బుక్‌లోని ప్రతి షాట్‌ని పంత్ ఆడగలడు. అతనికి బౌలింగ్ చేయడం చాలా కష్టం’’ అని వెల్లడించాడు.

కెరీర్ ఆరంభంలోనే జూనియర్ ధోనీగా కితాబులు అందుకున్న రిషబ్ పంత్.. నిలకడలేమితో ఇప్పుడు టీమ్‌లో తన చోటునే ప్రశ్నార్థకంగా మార్చుకున్నాడు. ఆటలో దూకుడు ఉంది.. కానీ.. షాట్ సెలక్షన్ ఏమాత్రం బాగాలేదని మాజీ క్రికెటర్లు పెదవి విరుస్తున్నారు. మ్యాచ్ గమనానికి అనుగుణంగా ఆడలేకపోవడం అతని బలహీనతగా చెప్పుకొస్తున్న విమర్శకులు.. ఫినిషింగ్ సిల్క్స్ లేవని తేల్చేశారు. దాంతో.. ఇప్పుడు కీపింగ్ రేసులో పంత్ కంటే కేఎల్ రాహుల్ ముందున్నాడు.


Tags :
|

Advertisement