Advertisement

  • పంత్ టాలెంట్ వేస్ట్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ..టీమిండియా మాజీ క్రికెటర్

పంత్ టాలెంట్ వేస్ట్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ..టీమిండియా మాజీ క్రికెటర్

By: Sankar Mon, 20 July 2020 12:55 PM

పంత్ టాలెంట్ వేస్ట్ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది ..టీమిండియా మాజీ క్రికెటర్



టీమిండియా క్రికెట్‌లో ఎంఎస్‌ ధోని వారసుడిగా కీపింగ్‌ బాధ్యతలు అందుకుని ఆందుకు తగ్గట్టుగానే ఆరంభంలో మెరిసిన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు అవకాశాలు కోసం వేచి చూసే పరిస్థితి వచ్చింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో వికెట్‌ కీపర్‌ స్థానాన్ని కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేయడంతో పంత్‌ వైపు టీమిండియా యాజమాన్యం కానీ సెలక్టర్లు కానీ చూడటం లేదు. గతంలో వరుసగా అవకాశాలు ఇచ్చుకుంటూ వచ్చిన సెలక్టర్లు.. ఉన్నపళంగా పంత్‌ ఊసే లేకుండా ఉన్నారు. దీనికి కారణం పంత్‌ స్వీయ తప్పిదమే అంటున్నాడు మాజీ క్రికెటర్‌ కీర్తి ఆజాద్‌. పంత్‌లో విపరీతమైన టాలెంట్‌ ఉన్నా గర్వంతోనే ప్రస్తుత పరిస్థితి తెచ్చుకున్నాడన్నాడు.

పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ కాస్త టెంపరితనం తగ్గించాలి. హఠాత్తుగా తన బ్యాటింగ్‌ను మార్చుకుంటాడు. ప్రతీ బంతిని బౌండరీ దాటించాలనుకోవడం అతని చోటుకు చేటు చేసింది. వన్డే, టెస్టు ఫార్మాట్‌ను కూడా టీ 20 ఫార్మాట్‌లో ఆడాలంటే ఎలా. ఇది పంత్‌ మార్చుకోవాల్సి ఉంది. పంత్‌ను పక్కన కూర్చోబెట్టడంతో అతని టాలెంట్‌ వృథా అవుతుందనే చెప్పాలి. నువ్వు వికెట్‌ దగ్గర నిలబడటం నేర్చుకుంటే పరుగులు వాటంతటే అవే వస్తాయి. ముందు స్టైక్‌ రోటేట్‌ చేయడం అలవాటు చేసుకోవాలి.

పంత్‌ కీపర్‌గా కంటే బ్యాట్స్‌మన్‌గాను మెరుగ్గా ఉన్నాడు. అయినా పూర్తి స్థాయి టాలెంట్‌ను బయటకు తీయలేకపోతున్నాడు. వచ్చిన అవకాశాల్లో అనవరసర తప్పిదాలు చేసి ఇప్పుడు చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. పంత్‌ మళ్లీ కచ్చితంగా అవకాశం ఇచ్చి చూడాలి. అతనికి ప్రత్యేకంగా ఒక స్థానాన్ని కూడా సెట్‌ చేస్తే మంచిది. పంత్‌ టాలెంట్‌ వేస్ట్‌ అవుతున్నందుకు నాకు చాలా బాధగా ఉంది’ అని స్పోర్ట్స్‌ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కీర్తి ఆజాద్‌ పేర్కొన్నాడు.

దాదాపు పదిహేను ఏళ్ళ పాటు ఇండియన్ క్రికెట్లో కీపర్ గా ఒక వెలుగు వెలిగాడు మహేంద్ర సింగ్ ధోని .మరి అంతటి దిగ్గజ ఆటగాడి స్థానాన్ని భర్తీ చేయాలి అంటే చాల కష్టమైన పని ..కానీ పంత్ లో ఉన్న స్పెషల్ టాలెంట్ చూసి చాల మంది ధోని స్థాన్నాన్ని పంత్ భర్తీ చేస్తాడు అని భావించారు ..కానీ పంత్ మాత్రం తనకు వచ్చిన అవకాశాలను వృధా చేసుకుంటున్నాడు ..బ్యాటింగ్ లో ఎన్ని అవకాశాలు ఇచ్చిన తన నిర్లక్ష్యపు బ్యాటింగుతో క్రీజ్లో ఎక్కువసేపు నిలువలేకపోతున్నాడు ..అయితే ఇప్పటికి ఇప్పుడే పంత్ కు జట్టులో చోటుకు వచ్చిన ముప్పు ఏమి లేదు ఇంకా చాల చిన్న ఏజ్ ఆటగాడు కావడంతో తన తప్పులు సరిచేసుకొని కొత్త పంత్ ను చూయిస్తే ధోని లేని బెంగ కనీసం కీపర్ వరకు అయినా తగ్గుతుంది ..

Tags :
|
|

Advertisement