Advertisement

  • హ్యాట్రిక్‌ సిక్సర్లతో అదరగొట్టిన రిషబ్ పంత్

హ్యాట్రిక్‌ సిక్సర్లతో అదరగొట్టిన రిషబ్ పంత్

By: Sankar Tue, 08 Sept 2020 3:11 PM

హ్యాట్రిక్‌ సిక్సర్లతో అదరగొట్టిన రిషబ్ పంత్


రిషబ్ పంత్ గత కొంతకాలంగా టీం ఇండియాలో బాగా వినిపిస్తున్న పేరు..ధోని స్థానాన్ని భర్తీ చేస్తాడు అని భావించిన పంత్ ఆ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాడు.దీనితో అతడి స్థానంలో కేఎల్‌ రాహుల్‌తో భర్తీ చేయడంతో అనూహ్యంగా చోటు కోల్పోయిన పంత్‌.. ఇప్పుడు కసి మీద కనిపిస్తున్నాడు.

యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌ తాజా సీజన్‌లో భాగంగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్‌ సీరియస్‌గా ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. ఐపీఎల్‌తో తన టీమిండియా రీఎంట్రీ ఉండాలనే ఏకైక లక్ష్యంతో పంత్‌ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం అతను ప్రాక్టీస్‌ చేస్తున్న తీరే ఇందుకు ఉదాహరణ. వరుసగా మూడు సిక్సర్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆనందాన్ని రెట్టింపు జేశాడు..

షార్జాలో ప్రాక్టీస్‌ సెషన్‌లో వెటరన్‌ లెగ్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో పంత్‌ హ్యాట్రిక్‌ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. తొలి బంతిని లాంగాన్‌ సిక్స్‌ కొట్టిన పంత్‌.. రెండో బంతిని డీప్‌ ఫైన్‌లెగ్‌ మీదుగా సిక్స్‌ బాదేశాడు. ఇక మూడో బంతిని లాంగాఫ్‌ వైపు బౌండరీ దాటించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఢిల్లీ క్యాపిటల్స్‌ షేర్‌ చేయగా, అది వైరల్‌గా మారింది. మరో పది రోజుల్లో ఆరంభమయ్యే ఐపీఎల్‌లో ఢిల్లీకి పంత్‌ కీలక ఆటగాడు. ప్రస్తుతం ఢిల్లీ మెంటార్‌ సౌరవ్‌ గంగూలీ అందుబాటులో లేకపోవడంతో, హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ పర్యవేక్షణలో ఢిల్లీ క్యాపిటల్స్‌ ప్రాక్టీస్‌ ముమ‍్మరం చేసింది.

Tags :
|
|

Advertisement