Advertisement

  • ఆ ఆటగాడి బ్యాటింగ్ నాకు ఆశ్చర్యం కలిగించింది...రికీ పాంటింగ్

ఆ ఆటగాడి బ్యాటింగ్ నాకు ఆశ్చర్యం కలిగించింది...రికీ పాంటింగ్

By: Sankar Wed, 28 Oct 2020 6:10 PM

ఆ ఆటగాడి బ్యాటింగ్ నాకు ఆశ్చర్యం కలిగించింది...రికీ పాంటింగ్


ఐపీఎల్‌ 13వ సీజన్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జూలు విదిల్చింది. స్వయంగా వార్నర్‌తో పాటు సాహా కూడా ఆహా అనిపించే రీతిలో విధ్వంసక బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చడంతో ఢిల్లీ క్యాపిటల్సపై భారీ విజయం సాధించింది.

88 పరుగుల భారీ విజయంతో ఎస్‌ఆర్‌హెచ్‌ ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. వృద్దిమాన్‌ సాహా 87 పరుగులతో జట్టు టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. మరో ఓపెనర్‌ వార్నర్‌ 66 పరుగులతో విధ్వంసం సృష్టించాడు..అయితే సహా బ్యాటింగ్ పై ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ ఆశ్చర్యంతో కూడిన ప్రశంసలు కురిపించాడు ..

ఈరోజు సాహా అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించాడు. నిజానికి అతని ఆట నన్ను కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. సాహా మంచి ప్రతిభ కలిగిన ఆటగాడిని ముందే తెలుసు.. కానీ ఐపీఎల్‌ 13వ సీజన్‌ ప్రారంభం నుంచి జట్టుతో ఉంటున్న తుది జట్టులో అతనికి అవకాశం రాలేదు. జానీ బెయిర్‌స్టో స్థానంలో ఢిల్లీతో మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి తుఫాను ఇన్నింగ్స్‌ ఆడేశాడు.

అతని ఆటతీరే మా ఇరు జట్ల మధ్య వత్యాసంగా చెప్పొచ్చు. ఒక తుఫాను వచ్చేముందు ఎంత ప్రశాంతంగా ఉంటుందో.. అచ్చం అలానే సాహా తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు. సాహా ప్రదర్శనతో జానీ బెయిర్‌స్టో రానున్న మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా రావడం కష్టమే.. ఒకవేళ ఆడినా ఇక నాలుగోస్థానంలోనే ఆడాలేమో.


Tags :

Advertisement