Advertisement

  • సిబిఐ దర్యాప్తుకు రియా చక్రవర్తి సహకరిస్తుంది..రియా తరుపు న్యాయవాది

సిబిఐ దర్యాప్తుకు రియా చక్రవర్తి సహకరిస్తుంది..రియా తరుపు న్యాయవాది

By: Sankar Wed, 19 Aug 2020 3:06 PM

సిబిఐ దర్యాప్తుకు రియా చక్రవర్తి సహకరిస్తుంది..రియా తరుపు న్యాయవాది


సీబీఐ దర్యాప్తును రియా చక్రవర్తి ఎదుర్కొంటారని ఆమె తరఫు న్యాయవాది సతీశ్ మనేషిండే తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసులో ముంబై పోలీసులు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు సహకరించిన మాదిరిగానే సీబీఐకి రియా సహకరిస్తారని ఆయన చెప్పారు.

ఈ కేసుపై ఏ సంస్థ దర్యాప్తు చేసినా ఆమె వాస్తవాలనే చెబుతారని ఆయన వెల్లడించారు. కేసు పరిస్థితులు, వాస్తవాలు, ముంబై పోలీసుల నివేదికను పరిశీలించిన తర్వాతే దీని దర్యాప్తును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిందని సతీశ్ తెలిపారు. ఈ కేసు విషయంలో న్యాయం జరుగాలని రియా చక్రవర్తి కోరుకున్నారని ఆయన చెప్పారు. అందుకే ఆమె కూడా సీబీఐ దర్యాప్తునకు మొగ్గుచూపారని రియా చక్రవర్తి తరుఫు న్యాయవాది సతీష్ మనేషిండే పేర్కొన్నారు.

నటుడు సుశాంత్ సింగ్ జూన్ 14న బాంద్రాలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నట్లు ముంబై పోలీసులు నిర్ధారించారు. అయితే తన కుమారుడి మరణంపట్ల ఆయన తండ్రి కేకే సింగ్, కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. సుశాంత్‌తో కలిసి సహజీవనం చేసినట్లు పేర్కొన్న రియా చక్రవర్తి, ఆమె కుటుంబ సభ్యులు తన కుమారుడి మరణానికి కారణమంటూ బీహార్‌లోని పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సుశాంత్ బ్యాంకు ఖాతాల నుంచి రూ.15 కోట్లు రియా, ఆమె కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లాయని ఆయన ఆరోపించారు. కాగా, పాట్నా పోలీసుల దర్యాప్తునకు ముంబై పోలీసులు సహకరించలేదు. దీంతో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించారు. ఈ వివాదం చివరకు సుప్రీంకోర్టుకు చేరగా సీబీఐ దర్యాప్తును సమర్థిస్తూ బుధవారం తీర్పు ఇచ్చింది.

Tags :
|
|

Advertisement