Advertisement

  • ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జనవరి నాలుగు నుంచి ...ఏపీ విద్యామంత్రి

ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జనవరి నాలుగు నుంచి ...ఏపీ విద్యామంత్రి

By: Sankar Sun, 13 Dec 2020 09:48 AM

ట్రిపుల్ ఐటీలలో ప్రవేశాలకు కౌన్సిలింగ్ జనవరి నాలుగు నుంచి ...ఏపీ విద్యామంత్రి


ఆర్జీయూకేటీ సెట్‌–2020 ఫలితాలను శనివారం విజయవాడలో ఆయన విడుదల చేశారు. ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించలేకపోవడంతో ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కోసం సెట్‌ను నిర్వహించామన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ..

కరోనా కారణంగా 6.30 లక్షల మందికిపైగా విద్యార్థులను పదో తరగతిలో పాస్‌ చేసినట్లు చెప్పారు. ఆర్జీయూకేటీ సెట్‌కు 88,974 మంది దరఖాస్తు చేయగా 85,755 మంది హాజరయ్యారన్నారు. ఈ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని వివరించారు..

కాగా ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ జనవరి 4 నుంచి ప్రారంభం కానుంది. అదే నెల రెండో వారం నుంచి తరగతులు ప్రారంభిస్తామని మంత్రి అన్నారు .. ఫలితాలను ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చామన్నారు. విద్యార్థులకు కటాఫ్‌ మార్కులతో కూడిన కాల్‌ లెటర్లు పంపిస్తామన్నారు.

Tags :
|
|

Advertisement