Advertisement

  • వాట్సాప్‌లో వైరల్‌ మెసేజ్‌ను రివర్స్‌ సెర్చ్‌ చేయడ౦ ద్వారా నకిలీదా అని తెలుస్తుంది

వాట్సాప్‌లో వైరల్‌ మెసేజ్‌ను రివర్స్‌ సెర్చ్‌ చేయడ౦ ద్వారా నకిలీదా అని తెలుస్తుంది

By: chandrasekar Wed, 05 Aug 2020 8:57 PM

వాట్సాప్‌లో వైరల్‌ మెసేజ్‌ను రివర్స్‌ సెర్చ్‌ చేయడ౦ ద్వారా నకిలీదా అని తెలుస్తుంది


సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ వాట్సాప్ నిబంధనలను కఠినతరం చేస్తున్నది. ఫేక్‌ న్యూస్‌కు అడ్డుకట్ట వేసేందుకు సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ఆరంభించింది. తప్పుడు సమాచారాన్ని నియంత్రించడానికి ఫొటోలు, మెసేజ్‌ టెక్ట్స్‌ను రివర్స్‌ సెర్చ్‌ చేసే ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నది.

రివర్స్‌ సెర్చింగ్‌ ద్వారా తరచుగా ఫార్వార్డ్‌ అవుతున్న సందేశం సరైనదా కాదా అనేది యూజర్లు తెలుసుకోవడానికి వెబ్‌సైట్‌లో చెక్‌ చేసేలా ఫీచ‌ర్‌ను రూపొందిస్తున్నది. వెబ్‌లో వైరల్‌ అవుతున్న మెసేజ్‌ను సెర్చ్‌ చేయడం ద్వారా నకిలీ వార్తలకు చెక్‌ పెట్టొచ్చు. వాట్సాప్‌ నుంచే నేరుగా మెసేజ్‌ లేదా ఫొటోలను వెబ్‌లో శోధించడానికి యూజర్‌కు అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌లో వైరల్‌ మెసేజ్‌ను రివర్స్‌ సెర్చ్‌ చేయడ౦ ఎలా ?

1. వాట్సాప్‌ ను ఓపెన్‌ చేయండి.

2. వైరల్‌ మెసేజ్‌ ఉన్న ఏదైనా ఒక చాట్‌లోకి వెళ్లండి. (పైన ఫార్మార్డ్‌ చేసిన లేబుల్‌తో డబుల్‌ బాణాలతో మార్క్‌ చేసిన సందేశం)

3. మ్యాగ్నిపైయింగ్‌ గ్లాస్‌ ఐకాన్‌ను ట్యాప్‌ చేసి పాప్‌ అప్‌ నుంచి 'సెర్చ్‌వెబ్'‌ను సెలక్ట్‌ చేయాలి.

ఇప్పుడు ఒక పేజీ ఓపెన్‌ అవుతుంది. అక్కడ వైరల్‌ మెసేజ్‌ అవాస్తవాలను వ్యాప్తి చేస్తున్నదా లేక నిజమైన సమాచారాన్ని కలిగి ఉన్నదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ టెస్టింగ్‌ దశలోనే ఉంది.

Tags :
|

Advertisement