Advertisement

  • హైదారాబాద్ లో రిటైర్డ్ జడ్జి కరోనా భయంతో ఆత్మహత్య

హైదారాబాద్ లో రిటైర్డ్ జడ్జి కరోనా భయంతో ఆత్మహత్య

By: chandrasekar Sat, 03 Oct 2020 6:52 PM

హైదారాబాద్ లో రిటైర్డ్ జడ్జి కరోనా భయంతో ఆత్మహత్య


హైదారాబాద్ లో రిటైర్డ్ జడ్జి కరోనా భయంతో ఆత్మహత్య చేసుకున్నారు. కరోనా వైరస్ లక్షణాలని అనుమానంతో బయపడి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తుంది. కరోనా ప్రజల జీవన వ్యవస్థపై చూపిన ప్రభావం అంతా, ఇంతా కాదు. ఇంకా ఈ మహమ్మారి వైరస్ కు వ్యాక్సిన్ కానీ, మెడిసిన్ కానీ అందుబాటులోకి రాలేదు. దీంతో కరోనా భయం ప్రజలను వెంటాడుతూనే ఉంది. తాజాగా కరోనా సింటమ్స్ ఉన్నాయనే అనుమానంతో శుక్రవారం రిటైర్డ్ జడ్జి రామచంద్రారెడ్డి ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

ఈ విషాద ఘటన హైదారాబాద్ లోని మియాపూర్ పరిధిలో చోటుచేసుకుంది. మియాపూర్‌లోని న్యూసైబర్‌ హిల్స్‌లో రిటైర్డ్‌ జడ్జి రామచంద్రారెడ్డి కుటుంబంతో కలసి నివసిస్తున్నాడు. కాగా గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో తనకు కరోనా లక్షణాలు ఉన్నాయేమోనన్న ఆందోళనతో రామచంద్రారెడ్డి తన ఇంట్లోని బెడ్‌రూంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శుక్రవారం బలవన్మరణానికి పాల్పడ్డాడు.

తన ఇంట్లోని బెడ్‌రూంలో ఘటనా స్థలంలో కుటుంబ సభ్యులను ఉద్దేశించి రామచంద్రారెడ్డి సూసైడ్‌ నోట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‌ తన వల్ల ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యలుకు కోవిడ్ సోకకూడదనే ఉద్దేశంతోనే ఆత్యహత్యకు పాల్పడుతున్నట్లు రామచంద్రారెడ్డి సూసైడ్‌ నోట్‌లో పేర్కొన్నారు. రామచంద్రారెడ్డి కుమారుడు రాజీవ్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మియాపూర్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Advertisement