Advertisement

  • హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు... వణికిపోతున్న నగరవాసులు...

హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు... వణికిపోతున్న నగరవాసులు...

By: chandrasekar Thu, 15 Oct 2020 6:09 PM

హైదరాబాద్ నగరంలో మళ్లీ వర్షాలు... వణికిపోతున్న నగరవాసులు...


హైదరాబాద్ నగరంలో గత రాత్రి మిగిల్చిన వాన బీభత్సాన్ని తలచుకొని నగరవాసులు వణికిపోతున్నారు. ఇప్పటికే ఇళ్లలోకి నీరు చేరి చాలా మంది సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. వందలాది కాలనీల్లో వరద నీరు అలాగే ఉంది. నాలాలు పోటెత్తుతున్నాయి. ఇలాంటి తరుణంలో మళ్లీ వర్షం కురుస్తుండటంతో భయాందోళనలు నెలకొన్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో మొదలైన వర్షం 11 గంటల వరకు ఉగ్రరూపం దాల్చింది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, ఆల్విన్ కాలనీ, షేక్‌పేట, మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, చందానగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. హిమాయత్ నగర్, నారాయణగూడ, రాంనగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిలుకలగూడ, ఈస్ట్ మారేడ్‌పల్లి ప్రాంతాల్లో వర్షపాతం కొనసాగుతోంది.

మెహిదీపట్నం, లంగర్‌హౌస్, గోల్కొండ, నాలాల్ నగర్, టోలిచౌకి, చార్మినార్, బహదూర్‌పురా, జూపార్కు, పురానాపూల్, హఫీజ్‌పేట్ ప్రాంతాల్లోనూ వాన పడుతోంది. యూసుఫ్‌గూడ, బోరబండ, మోతీనగర్, ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్‌పేట, ఏఎస్‌రావు నగర్, రెహమాన్ నగర్ ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సికింద్రాబాద్ పరిధిలోని అల్వాల్ విషాదం చోటు చేసుకుంది. వరద నీటిలో పడి వృద్ధురాలు మృతి చెందింది. ఇంట్లో నిద్రిస్తూ వరద నీటిలో పడి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఇక హైదరాబాద్- విజయవాడ రహదారిలో మరోసారి ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో ఇనాంగూడ నుంచి తుప్రాన్‌పేట వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రాచకొండ పోలీసులు ట్రాఫిక్‌లో చిక్కుకున్న వారి ఆకలి తీరుస్తున్నారు. హైవే వెంట పలు ప్రాంతాల్లో పోలీసులు ఆహార పొట్లాలను పంపిణీ చేస్తున్నారు.

Tags :
|

Advertisement