Advertisement

  • జీతాలు చెల్లించలేదని రెసిడెంట్ డాక్టర్స్ నిరసన...

జీతాలు చెల్లించలేదని రెసిడెంట్ డాక్టర్స్ నిరసన...

By: chandrasekar Sat, 17 Oct 2020 1:10 PM

జీతాలు చెల్లించలేదని రెసిడెంట్ డాక్టర్స్ నిరసన...


ఢిల్లీలోని కస్తురిబా గాంధీ హాస్పిటల్‌కి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ నిరసనకు దిగారు. కరోనావైరస్ మహమ్మారి వ్యాపిస్తున్న కష్టకాలంలోనూ కరోనా నివారణ కోసం కరోనా పెషెంట్స్‌కి సేవలు చేసిన తమకు జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ కస్తురిబా గాంధీ హాస్పిటల్‌కి చెందిన డాక్టర్స్ నిరసన ప్రారంభించారు.

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైద్యులు కొవ్వోత్తులు వెలిగించి తమ నిరసన తెలియచేశారు. నార్త్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని హిందు రావు హాస్పిటల్, రాజెన్ బాబు టీబీ హాస్పిటల్‌కి చెందిన రెసిడెంట్ డాక్టర్స్ సైతం ఈ నిరసనలో పాల్గొన్నారు.

గత మూడు, నాలుగు నెలలుగా తమకు జీతాలు చెల్లించలేదని, రోజుల తరబడి ఆందోళన చేస్తున్నా పట్టించుకోవడం లేదని వైద్యులు ఆవేదన వ్యక్తం చేసారు. తక్షణమే వేతనం బకాయిలు విడుదల చేయకపోతే సమ్మె తీవ్రతరం చేస్తామని వైద్యులు ప్రభుత్వాన్నిహెచ్చరించారు.

వైద్యులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో బుధవారం రాత్రి ట్విటర్ ద్వారా స్పందించిన నార్త్ ఢిల్లీ మేయర్ జై ప్రకాశ్'' డాక్టర్స్, నర్సులు, పారామెడిక్స్, సి, డి గ్రూప్ సిబ్బందికి ఇవాళ జీతాలు విడుదల చేశామని మిగతా వారికి కూడా త్వరలోనే చెల్లిస్తాం'' అని తెలిపారు. ఇదే విషయమై మేయర్ జై ప్రకాశ్‌ని మీడియా వివరణ కోరగా జులై నెల జీతాలు చెల్లించినట్టు తెలిపారు.

Tags :

Advertisement