Advertisement

టీఆర్పీ స్కాం కేసులో రిపబ్లిక్ టీవీకి షాక్

By: Sankar Tue, 10 Nov 2020 4:52 PM

టీఆర్పీ స్కాం కేసులో రిపబ్లిక్ టీవీకి షాక్


రిపబ్లిక్‌ టీవికి మరో షాక్‌ తగిలింది. ఈ ఛానెల్‌ సీఈవో అర్నాబ్‌ గోస్వామి ఇప్పటికే అరెస్టయ్యారు. 2018లో ఆర్కిటెక్ట్‌ అన్వే నాయక్‌ మరియు అతని తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ కేసులో అర్నాబ్‌ గోస్వామి సహా మరో ఇద్దరిని నవంబర్‌ 4న ముంబై పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా టీఆర్‌పీ స్కామ్‌కు సంబంధించి రిపబ్లిక్‌ టీవీ డిస్ట్రిబ్యూషన్‌ హెడ్‌ ఘన్శ్యామ్‌ సింగ్ ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు తాజాగా సింగ్‌ను 12వ నిందితుడిగా చేరుస్తూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. బార్క్‌ రేటింగ్‌ల ఆధారంగానే టీవీ ఛానళ్లకు ప్రకటనలు అందుతాయి.

టీఆర్‌పీ రేటింగ్‌లు పెంచుకునేందుకు రిపబ్లిక్‌ టీవీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోందని ముంబై పోలీసులు కేసును నమోదు చేసి రిపబ్లిక్‌ టీవీ సీఎఫ్‌వో సుందరంను విచారించారు. తమ ఛానల్‌కు ఎక్కువ మొత్తంలో టీఆర్పీ లభిస్తోందని చెబుతూ పెద్ద ఎత్తున డబ్బులను అడ్వర్టైజర్ల నుండి అందుకుంటూ ఉన్నారు.

Tags :

Advertisement