Advertisement

  • టెలివిజన్​ రేటింగ్స్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో సీఈఓ అరెస్టు...!

టెలివిజన్​ రేటింగ్స్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో సీఈఓ అరెస్టు...!

By: Anji Sun, 13 Dec 2020 1:58 PM

టెలివిజన్​ రేటింగ్స్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో సీఈఓ అరెస్టు...!

టెలివిజన్​ రేటింగ్స్​ పాయింట్స్​ (టీఆర్​పీ) కుంభకోణంలో రిపబ్లిక్​ టీవీ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి(సీఈఓ) వికాస్​ ఖంచందానిను ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు.

సెలవు దినం రోజున ఏర్పాటు చేసే ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసును విచారిస్తున్న క్రైమ్​ ఇంటెలిజెన్స్​ యూనిట్​ (సీఐయూ) ఇప్పటికే 12 మందిని అరెస్ట్​ చేసి విచారిస్తోంది.

టీఆర్‌పీల విషయంలో కొన్నిఛానళ్లు మోసాలకు పాల్పడుతున్నాయని బ్రాడ్​కాస్ట్​ ఆడియన్స్ రీసెర్చ్​ కౌన్సిల్​(బార్క్​) ఇప్పటికే పలు మీడియా సంస్థలపై కేసులు నమోదు చేసింది.

కొంతమందికి డబ్బులు ఇచ్చి.. తమ ఛానళ్లు చూసేలా చేస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి.సీఈఓ అరెస్ట్​కు వ్యతిరేకంగా రిపబ్లిక్​ టీవీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది.

Tags :

Advertisement