Advertisement

  • కెబిఆర్ పార్క్ కు వెళ్లే వారికి రెన్యువల్ గడువు పెంపు

కెబిఆర్ పార్క్ కు వెళ్లే వారికి రెన్యువల్ గడువు పెంపు

By: chandrasekar Wed, 07 Oct 2020 4:17 PM

కెబిఆర్ పార్క్ కు వెళ్లే వారికి రెన్యువల్ గడువు పెంపు


హైదరాబాద్ లో ఉన్న కాసు బ్రహ్మానంద రెడ్డి నేషనల్ పార్కుకు మార్నింగ్ వాక్ కోసం రోజూ వందల సంఖ్యలో జనం వస్తుంటారు. వీరిలో సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు కూడా ఉంటారు. దాదాపు 390 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ పార్కు ముఖ్యంగా మార్నింగ్ వాకర్స్‌కు చిరునామాగా ఉంది. అయితే, రోజూ ఈ పార్కుకు వచ్చే వారి కోసం తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఓ గుడ్ న్యూస్ చెప్పారు.

పార్కులో రోజూ మార్నింగ్ వాక్, ఇతరత్రా ఎక్సర్‌సైజులు చేసుకోవడం కోసం వార్షిక పాసులు తీసుకున్నవారికి రెన్యువల్ గడువును పెంచుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

గత జూన్ నెల‌తో పాసుల గ‌డువు ముగిసిన‌ప్పటికీ క‌రోనా నేప‌థ్యంలో డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు వార్షిక పాసుల గడువు పెంచుతున్నట్లు మంత్రి తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడం వల్ల విధించిన లాక్ డౌన్‌తో గత ఏప్రిల్, మే, జూన్ నెల‌ల్లో మూతబడ్డ అన్ని కార్యకలాపాలతో పాటూ కేబీఆర్ పార్కును కూడా పూర్తిగా మూసి వేసిన సంగతి తెలిసిందే. ఇటీవల లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా పార్కును తెరిచారు. ఇకపై మార్నింగ్ వాకర్స్ వచ్చే ఏడాది జనవరిలో కొత్త పాసుల‌ను తీసుకోవాల్సి ఉంటుంద‌ని మంత్రి తెలిపారు. ఈ సంద‌ర్భంగా కేబీఆర్ పార్కు వాక‌ర్స్ అసోసియేష‌న్ మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డికి కృత‌జ్ఞత‌లు తెలిపారు.

Tags :

Advertisement