Advertisement

  • ప్రధాని పదవి నుంచి తొలగించడం అసాధ్యమైన పని: నేపాల్ ప్రధానమంత్రి

ప్రధాని పదవి నుంచి తొలగించడం అసాధ్యమైన పని: నేపాల్ ప్రధానమంత్రి

By: chandrasekar Mon, 29 June 2020 2:38 PM

ప్రధాని పదవి నుంచి తొలగించడం అసాధ్యమైన పని: నేపాల్ ప్రధానమంత్రి


నేపాల్‌ దేశ కొత్త పటాన్ని పార్లంమెంట్‌లో రాజ్యంగ సవరణ ద్వారా తీసుకొచ్చినందుకు తనపై కక్షగట్టిన భారత్ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు‌ కుట్రపన్నుతోందని నేపాల్‌ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ ఆరోపించారు. నేపాల్ ప్రధాని పదవి నుంచి నన్ను తొలగించడం అసాధ్యమైన పని అని అన్నారు. నేపాల్‌ దేశ కొత్త పటాన్ని పార్లంమెంట్‌లో రాజ్యంగ సవరణ ద్వారా తీసుకొచ్చినందుకు తనపై కక్షగట్టిన భారత్ తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపన్నిందన్నారు.

ప్రధాని నివాసంలో జరిగిన నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ ప్రముఖ నాయకుడు, దివంగత మదన్ భండారి 69 వ జయంతిని పురస్కరించుకుని కేపీ ఓలీ మాట్లాడారు. తనను తొలగించేందుకు ఆట మొదలైందని, కొందరు పొరుగుదేశం వారితో కలిసి కుట్ర పన్నారని ఆరోపించారు.

తనను ప్రధాని పదవి నుంచి తొలగించడం అంత సులువైన పనికాదని వారు గుర్తుంచుకోవాలన్నారు. ఖాట్మండూలోని ఒక హోటల్‌లో సమావేశాలు, చర్చలు మొదలయ్యాయని, దీనిలో ఇండియన్‌ ఎంబసీ కూడా పాలుపంచుకొన్నదని చెప్పారు.

అయితే, ఇంతవరకు ఎవరూ తనను పదవికి రాజీనామా చేయమని బహిరంగంగా అడగలేదని తెలిపారు. "నన్ను ప్రధాని పదవి నుంచి తొలగించేందుకు పోటీ ఎక్కువైంది. నేపాల్ జాతీయత బలహీనంగా లేదు. మ్యాప్‌ను ముద్రించినందుకు ప్రధానిని పదవి నుంచి తొలగిస్తారని ఎవరూ అనుకోవడంలేదు " అని కేపీ శర్మ ఓలీ అన్నారు.

లిపులేఖ్, కాళాపాణి, లింపియాధురా ప్రాంతాలతో కలిగి ఉన్న నేపాల్ కొత్త రాజకీయ పటం కోసం రాజ్యాంగ సవరణను నేపాల్ పార్లమెంట్‌ జూన్ 13న ఆమోదించింది. అయితే దీనిపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నేపాల్ ఇలాంటి పనులు మానుకోవాలని, ఆ మూడు ప్రాంతాలు భారత్‌లో అంతర్భాగమని హెచ్చరించింది. చైనా అండతో గత కొన్నిరోజులుగా రెచ్చిపోతున్న నేపాల్‌ ప్రధాని ఓలీ భారత్‌పై అర్థంపర్థంలేని అభాండాలు వేస్తూ తనను ఏమీ చేయలేరంటూ సవాల్‌ విసిరారు.

నేపాల్‌ కొత్త పటాన్ని తీసుకొచ్చేందుకు పార్లమెంట్‌లో సొంతపార్టీ నుంచే కష్టాలు ఎదుర్కొన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేయాలంటూ నేపాలీ కమ్యూనిస్ట్‌ పార్టీకి చెందిన పలువురు సభ్యులు ఆయనను డిమాండ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Advertisement