Advertisement

  • ఆధార్ వివరాలు అడగొద్దు ...ధరణి పోర్టల్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ పై హైకోర్ట్ ఆదేశాలు

ఆధార్ వివరాలు అడగొద్దు ...ధరణి పోర్టల్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ పై హైకోర్ట్ ఆదేశాలు

By: Sankar Thu, 17 Dec 2020 7:04 PM

ఆధార్ వివరాలు అడగొద్దు ...ధరణి పోర్టల్ లో ఆస్తుల రిజిస్ట్రేషన్ పై హైకోర్ట్ ఆదేశాలు


వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో ఆధార్ వివరాలు తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు తదుపరి విచారణ జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.

సాఫ్ట్ వేర్‌లో ఆధార్ కాలమ్ తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని ఆదేశించింది. కులం, కుటుంబ సభ్యుల వివరాలు కూడా తొలగించాలని, వ్యవసాయే తర రిజిస్ట్రేషన్లు కొనసాగించవచ్చునని, రిజిస్ట్రేషన్ అధికారులు ఆధార్ వివరాలు మాత్రం అడగవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

రిజిస్ట్రేషన్ కోసం ఇతర గుర్తింపు పత్రాలు అడగా వచ్చునని, కానీ ఆధార్‌కు సంబంధించిన వివరాలు అడగకూడదని హైకోర్టు స్పష్టంగా వెల్లడించింది...ప్రభుత్వం తెలివిగా ప్రజల సున్నితమైన సమాచారం సేకరిస్తే అంగీకరించబోమని హైకోర్టు హెచ్చరించింది.

Tags :
|

Advertisement