Advertisement

ఏపీలో 8లక్షల కార్డుల తొలగింపు...

By: chandrasekar Wed, 09 Dec 2020 5:48 PM

ఏపీలో 8లక్షల కార్డుల తొలగింపు...


నవంబరు 1 నాటితో పోల్చితే ఏపీలో రేషన్‌ కార్డుల సంఖ్య 8.44 లక్షలు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా కార్డుల సంఖ్య 1,52,70,000 నుంచి 1,44,26,000కి తగ్గింది. గత నెల క్రితంతో పోల్చితే 8.44 లక్షల కార్డులను తొలగించారు. సరుకుల కోసం వెళ్లి ఈపాస్ యంత్రాల్లో వేలి ముద్రలు వేయడానికి ప్రయత్నించగా వారి వివరాలు రావడం లేదు. దీంతో రేషన్‌ కోసం వెళ్లే కార్డుదారులు ఈ నెల ఎందుకు నిలిపి వేసారని అడుగుతున్నారు. రేషన్ కార్డులు తొలగించడానికి కారణ౦.. ఐటీ రిటర్న్స్ ప్రధాన అని అంటున్నారు. ఆదాయ పన్ను రిటర్న్స్ చేసిన వారి రేషన్ నిలిపివేసినట్లు వాలంటీర్లు అంటున్నారట. పట్టణాల్లో నెలకు రూ.12వేలు, గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10వేలకు పైగా ఆదాయం ఉన్నవారు, వ్యవసాయ భూములు ఎక్కువగా ఉన్నవారు, కుటుంబంలో ఎవరికైనా సొంత కార్లు ఉన్నవారు, ఆదాయపన్నులు చెల్లిస్తున్నవారి కార్డులను తొలగించింది.

కార్డులు తొలగించిన వారు తమ పూర్తి వివరాలను గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇచ్చిన మరోసారి పరిశీలించి కార్డులు మంజూరు చేస్తామని అధికారులు అంటున్నారు. పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్తగా రైస్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా సర్వే చేసి కొత్త కార్డులు జారీ చేసింది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచే కొత బియ్యం కార్డుల ద్వారానే రేషన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది. ఈలోపు కరోనా రావడంతో ప్రభుత్వం ప్రయత్నాన్ని విరమించుకుంది. లాక్ డౌన్ సమయం నుంచి ఉచిత రేషన్ ప్రారంభం కావడంతో పాత రేషన్ కార్డుల ఆధారంగానే నవంబర్ నెలాఖరు వరకు ఉచిత రేషన్ పంపిణీ చేసింది. ఈనెల నుంచి పాత రేషన్ కార్డులను పక్కనబెట్టి ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన బియ్యం కార్డులపై నిత్యావసరాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ కార్డుల తొలగింపుతో ప్రజలు షాక్ అయ్యారు.

Tags :
|
|
|

Advertisement