Advertisement

  • విజయవాడ దుర్గమ్మ గుడిలో 25 మంది ఉద్యోగుల తొలగింపు

విజయవాడ దుర్గమ్మ గుడిలో 25 మంది ఉద్యోగుల తొలగింపు

By: chandrasekar Thu, 11 June 2020 02:26 AM

విజయవాడ దుర్గమ్మ గుడిలో 25 మంది ఉద్యోగుల తొలగింపు


కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం విజయవాడ కనకదుర్గమ్మ గుడిపై కూడా పడింది. ప్రస్తుత కరోనా కష్ట కాలంలో సుమారు 25 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని దుర్గ గుడి దేవస్థానం ట్రస్ట్ తొలగించింది. టికెట్ కౌంటర్లు, లడ్డు కౌంటర్లు, దర్శనం టికెట్ కౌంటర్లలో తాత్కాలిక సిబ్బంది స్థానంలో శాశ్వత ఉద్యోగులకు విధులు కేటాయించారు. ఆదాయం లేకపోవటం, ఉన్న సిబ్బందికి పని లేకపోవడమే ఉద్యోగుల తొలగింపునకు కారణమని దేవస్థానం అధికారులు చెబుతున్నారు.

కంప్యూటర్ ఆపరేటింగ్ రాక శాశ్వత సిబ్బంది సైతం ఇబ్బందులు పడుతున్నారు. తాత్కాలిక సిబ్బంది తొలగింపుపై ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. కరోనా వల్ల లాక్ డౌన్ విధించడానికి ముందు తీసుకున్న మరికొందరు తాత్కాలిక సిబ్బందిని తొలగించకుండా సీనియర్లను తొలగించారంటూ ఓ వైపు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

removal of,employees,at vijayawada,durgamma,temple ,విజయవాడ, దుర్గమ్మ, గుడిలో, 25 మంది, ఉద్యోగుల తొలగింపు


మరోవైపు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 5.0లో ఇచ్చిన సడలింపులకు అనుగుణంగా ఏపీలో కంటైన్మెంట్ జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తిరిగి తెరుచుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు తిరుమల శ్రీవారి దర్శనానికి సాధారణ భక్తులకు టీటీడీ గురువారం నుంచి అనుమతులు ఇచ్చింది. ప్రతి రోజూ 7 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి టీటీడీ ఏర్పాట్లు చేయగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం ఏడున్నర గంటల వరకు దర్శనానికి అనుమతులు ఉన్నాయి.

Tags :

Advertisement