Advertisement

  • ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ రోజు ఈ స్వాతంత్య్ర భారత దేశం

ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ రోజు ఈ స్వాతంత్య్ర భారత దేశం

By: Sankar Thu, 13 Aug 2020 5:29 PM

ఎందరో మహానుభావుల త్యాగ ఫలం ఈ రోజు ఈ స్వాతంత్య్ర భారత దేశం

మరొక రెండు రోజుల్లో భారత దేశం 74 వ స్వతంత్ర దినోత్త్సవాన్ని జరుపుకోనుంది ..ప్రతి ఏడాది కూడా ఎంతో ఉత్సాహంతో , ఎంతో దేశ భక్తితో దేశం మొత్తం కూడా జాతీయ జెండాలను ఎగురవేస్తూ స్వతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ అత్యంత వైభవోపేతంగా జరుపుకుంటాము ..అయితే ఈ సారి మాత్రం కరోనా మహమ్మారి కారణంగా స్వతంత్ర వేడులు మునుపటి స్థాయిలో జరుపుకోలేకపోతున్నాము..అయితే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక్కసారి భారత స్వతంత్ర పోరాటంలో ముఖ్య సంఘటనలను నెమరేసుకుందాము..

తొలుత వర్తకం కోసం అని భారదేశానికి వచ్చిన బ్రిటిష్ వారు మెల్లగా మెల్లగా భారత్ దేశాన్ని ఆక్రమించుకున్నారు ..మొదటగా 1757 లో జరిగిన ప్లాసీ యుద్ధం తర్వాత భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ రూలింగ్ ప్రారంభం అయింది.. ఆ తర్వాత జరిగిన బాక్సర్ యుద్ధంతో బ్రిటిష్ వారు దేశం మీద పూర్తిగా పట్టు తెచ్చుకున్నారు ..ఈ క్రమంలోనే తమతో పాటు వర్తకానికి వచ్చిన పోర్చుగీస్ , డచ్ , ఫ్రెంచ్ వారిని దేశం నుంచి తరిమికొట్టారు ..1757 లో ప్రారంభం అయినా బ్రిటిష్ వారి రూలింగ్ 1857 వరకు నిరాటంకంగా జరిగింది

అయితే 1857 లో సిపాయిల తిరుగుబాటు పేరుతో బ్రిటిష్ వారిని దేశం నుంచి తరిమి కొట్టేందుకు ఒక గొప్ప పోరాటమే జరిగింది ..ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ లో మొదలయిన ఈ పోరాటం ఆ తర్వాత ఢిల్లీ చేరుకొని తర్వాత దేశం మొత్తం వ్యాపించింది ..అయితే బ్రిటిష్ వారు ఈ పోరాటాన్ని సమర్థవంతంగా తిప్పి కొట్టారు ..అయితే వారు తిప్పికొట్టారు అనడం కంటే మన వాళ్ళ మధ్య ఐకమత్యం లేకపోవడం వల్లనే ఓడిపోయాము అనడం సబబు గ ఉంటుంది..దేశంలో వివిధ ప్రాంతాలను వివిధ సామంత రాజులూ ఫలించడంతో అందరు ఏకతాటి పైకి రాలేదు..దీనితో ఇదే అదను అని భావించిన బ్రిటిష్ వారు చాల మంది దేశీయ రాజులను కొని ఎక్కడిక్కడ పోరాటాన్ని అణచివేశారు ..అయితే ఝాన్సీ లక్ష్మి భాయ్ లాంటి వీరనారీలు ఈ పోరాటంలో తమ ప్రాణాలను కోల్పోయారు ..


independence day,event,reminding,significant,events,freedom,fight,gandhi,quit india movement ,ఎందరో,  మహానుభావుల,  త్యాగ ఫలం,  ఈ రోజు,  ఈ స్వాతంత్య్ర భారత దేశం ,


ఇక ఈ సిపాయిల తిరుగుబాటు తర్వాత భారత దేశం పూర్తిగా బ్రిటిష్ చేతిలోకి పోయింది ..బ్రిటన్ నుంచి ఇంగ్లాండ్ రాణి పరిపాలించసాగింది..ఇక సిపాయిల తిరుగుబాటు అయినపోయిన తర్వాత కొంతకలం స్తబ్దుగా ఉన్నప్పటికీ 1885 ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ స్థాపించిన తర్వాత మల్లి స్వతంత్ర ఉద్యమంలో కదలిక వచ్చింది ..మెల్లగా మెల్లగా భారతీయుల డిమాండ్ లను బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఉంచేందుకు కొంతమంది చట్టసభల్లోకి కూడా ఎన్నిక అయ్యారు ..

అయితే ఐఎన్సి లో మొత్తం మితవాదులు ఉండటంతో ఇలా ప్రార్థిస్తే స్వతంత్రం రాదు అని , వారితో పోరాడాల్సిందే అని అతివాద నాయకులూ అయినా బాల గంగాధర్ తిలక్ , లాల లజపతిరాయ్ , బిపిన్ చంద్ర పాల్ లు అతివాద నాయకులుగా మారి బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటానికి దిగారు..ఇక ఆ తర్వాత గాంధీ రాకతో స్వతంత్ర పోరాటం తన రూపురేఖలు మార్చుకుంది..

దేశంలో ఉన్న ప్రజలు అందరిని ఒక తాటి మీదకు తీసుకువచ్చి స్వంత్రతం వచ్చేవరకు గాంధీ పోరాడారు ..ఈ పోరాటంలో గాంధీ మూడు అత్యుత్తమ పోరాటాలు చేసారు ..ఒకటి శాసనోల్లంఘన ఉద్యమం , రెండు ఉప్పుసత్యాగ్రహం , మూడు క్విట్ ఇండియా ఉద్యమం ..ఈ మూడు అతి పెద్ద పోరాటాలతో బ్రిటిష్ వాళ్ళ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చి దేశానికి స్వతంత్రం వచ్చేలా చేసారు ..కేవలం గాంధీ ఒక్కరే కాకుండా సుభాష్ చంద్ర బోస్ , భగత్ సింగ్ , నెహ్రు , వల్లభాయిపటేల్ వంటివారు చివరి దశ ఉద్యమంలో పోరాడారు..వీరు అందరి పోరాటాల ఫలితంగా 1947 ఆగష్టు 15 అర్ధరాత్రి భారత దేశం స్వతంత్రం సంపాదించింది..ఇలాంటి ఎందరో మహనీయుల పోరాటం వల్లనే ఈ రోజు మనం ఈ స్వేచ్ఛ వాయువులను పీలుస్తున్నాము

Tags :
|
|
|
|

Advertisement