Advertisement

  • స్టోక్స్‌ అసలు ఐపీఎల్‌ లీగ్‌లో ఆడతాడా అన్నది డౌటే!

స్టోక్స్‌ అసలు ఐపీఎల్‌ లీగ్‌లో ఆడతాడా అన్నది డౌటే!

By: chandrasekar Tue, 08 Sept 2020 10:35 AM

స్టోక్స్‌ అసలు ఐపీఎల్‌ లీగ్‌లో ఆడతాడా అన్నది డౌటే!


ఐపీఎల్‌ తొలి అంచె పోటీలకు రాజస్థాన్‌ రాయల్స్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. బ్రెయిన్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తన తండ్రి జెడ్‌ స్టోక్స్‌ను దగ్గరుండి చూసుకుంటున్న బెన్‌ ఐపీఎల్‌లో ఆడేందుకు మరింత సమయం పట్టేలా ఉంది. తండ్రి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడంతో పాకిస్థాన్‌తో టెస్టు సిరీస్‌ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న స్టోక్స్‌ ప్రస్తుతం కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతున్నాడు.

ఈ కారణంగా లీగ్‌ తొలి అంచె పోటీలకు స్టోక్స్‌ అందుబాటులో ఉండేది అనుమానంగా మారగా, అసలు లీగ్‌లో ఆడుతాడ అన్నది ప్రశ్నగా మిగిలింది. దీనిపై జట్టు వర్గాలు స్పందిస్తూ ‘న్యూజిలాండ్‌లో క్వారంటైన్‌ నిబంధనల ప్రకారం తాజాగా 14 రోజుల ఐసోలేషన్‌ పీరియడ్‌ను స్టోక్స్‌ పూర్తి చేసుకున్నాడు. త్వరలో అతని తండ్రిని కలుసుకోనున్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలో కుటుంబంతో కలిసి గడపనున్నాడు. అతను లీగ్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అన్నది కొద్ది రోజుల తర్వాతే తెలుస్తుంది’ అని తెలిపాయి.

Tags :
|

Advertisement