Advertisement

  • అతిపెద్ద బ్రాండ్లలో రెండో స్థానం దక్కించుకున్న రిలయన్స్‌

అతిపెద్ద బ్రాండ్లలో రెండో స్థానం దక్కించుకున్న రిలయన్స్‌

By: chandrasekar Thu, 06 Aug 2020 3:54 PM

అతిపెద్ద బ్రాండ్లలో రెండో స్థానం దక్కించుకున్న రిలయన్స్‌


రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్ ముకేశ్‌ అంబానీ నేతృత్వంలో నడుస్తున్న సంస్థ‌ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రాండ్లలో రెండో స్థానం దక్కించుకున్నది.

అమెరికా టెక్నాలజీ దిగ్గజం ఆపిల్‌ తర్వాత రిలయన్సేనని ఫ్యూచర్‌బ్రాండ్‌ ఇండెక్స్‌ 2020 జాబితాలో తేలింది.

సామ్‌సంగ్‌ మూడో స్థానంలో ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా ఎన్విడియా, మౌటాయ్‌, నైక్‌, మైక్రోసాఫ్ట్‌, ఏఎస్‌ఎంఎల్‌, పేపల్‌, నెట్‌ఫ్లిక్స్‌ ఉన్నాయి.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వృద్ధి పథంలో దూసుకుపోతున్నదని, కస్టమర్లకు మెరుగైన సేవలను అందిస్తూ, కొత్త ఆలోచనలతో పరుగులు పెడుతున్నదని ఫ్యూచర్‌ బ్రాండ్‌ ఈ సందర్భంగా తెలిపించి.

ఆరేండ్లలో ప్రపంచవ్యాప్తంగా వ్యాపార రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయని, సంస్థల ప్రాధాన్యాలు కూడా మారాయని తెలిపింది.

Tags :
|

Advertisement