Advertisement

  • ఫార్చ్యూన్ గ్లోబల్100 జాబితాలో చోటు దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

ఫార్చ్యూన్ గ్లోబల్100 జాబితాలో చోటు దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

By: chandrasekar Wed, 12 Aug 2020 2:24 PM

ఫార్చ్యూన్ గ్లోబల్100 జాబితాలో చోటు దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్


ఫార్చ్యూన్ గ్లోబల్ 500 జాబితాలో రిలయన్స్ కు చోటు దక్కింది. టాప్ 100 జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 96 వ స్థానంలో నిలిచింది. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ఈ జాబితాను మంగళవారం విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ కు చెందిన ఒక్క రిలయన్స్ కంపెనీకే స్థానం దక్కగా చైనాకు చెందిన 24 కంపెనీలు చోటుదక్కించుకున్నాయి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా భారతదేశం యొక్క అగ్రశ్రేణి సంస్థ రిలయన్స్ కంపెనీ 10 స్థానాలను అధిగమించి ప్రపంచంలోని టాప్ 100 కంపెనీలలో చోటు దక్కించుకున్నది. ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రతి సంవత్సరం ప్రచురించే జాబితాలో టాప్ 100 గ్లోబల్ కంపెనీలలో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ సంస్థ రిలయన్స్. ఫార్చ్యూన్ 500 జాబితాలో 17 సంవత్సరాలుగా ఈ సంస్థ ఉన్నది.

టాప్ 5 గ్లోబల్ కంపెనీలలో మూడు చైనీస్, ఒకటి యూఎస్ నుంచి, ఒకటి ఆంగ్లో-డచ్ ఉన్నాయి. 2020 జాబితాలో అమెరికా నుంచి రిటైల్ మేజర్ వాల్మార్ట్ అగ్రస్థానంలో ఉన్నది. చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం, రసాయన దిగ్గజం సినోపెక్ గ్రూప్, చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని విద్యుత్ సంస్థ స్టేట్ గ్రిడ్, చైనా నేషనల్ పెట్రోలియం కార్ప్ (సీఎన్‌పీసీ) ఉన్నాయి. ఆంగ్లో-డచ్ చమురు, గ్యాస్ బహుళజాతి సంస్థ రాయల్ డచ్ షెల్ ఐదవ స్థానంలో ఉంది.

Tags :
|

Advertisement