Advertisement

  • రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ..ఆసియాలోకెల్లా లోతైన గ్యాస్ ఫీల్డ్...

రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ..ఆసియాలోకెల్లా లోతైన గ్యాస్ ఫీల్డ్...

By: chandrasekar Fri, 18 Dec 2020 8:56 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ..ఆసియాలోకెల్లా లోతైన గ్యాస్ ఫీల్డ్...


కేజీ-డీ6 కృష్ణా-గోదావరి బ్లాక్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ గ్యాస్ బావి నుంచి సహజ వాయువును వెలికి తీయనున్నారు. కాకినాడ తీరంలో ప్రస్తుతం ఉన్న కేజీ డీ6 కంట్రోల్ అండ్ రైజర్ ప్లాట్‌ఫామ్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఆర్ క్లస్టర్ ఫీల్డ్ ఉంది. ఈ గ్యాస్ ఫీల్డ్ సముద్ర గర్భంలో 2000 మీటర్ల కంటే లోతున ఉంది. ఇది ఆసియాలోకెల్లా లోతైన గ్యాస్ ఫీల్డ్‌గా భావిస్తున్నారు. ఇక్కడ తీసే గ్యాస్ 2023 నాటికి భారత అవసరాల్లో 15 శాతాన్ని తీర్చగలదు. దేశీయ గ్యాస్ ఉత్పత్తిలో ఇది 25 శాతం ఉంటుంది.

ముకేశ్ అంబానీకి చెందిన ఆర్‌ఐఎల్, బీపీ కలిసి కేజీ డీ6‌లో ఆర్ క్లస్టర్, శాటిలైట్స్ క్లస్టర్, ఎంజే అనే మూడు డీప్ వాటర్ గ్యాస్ ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాయి. కేజీ డీ6లో రిలయన్స్‌కు 66.67 శాతం, బీపీకి 33.33 శాతం పార్టిసిపెంట్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. 2021 నాటికి రోజుకు 12.9 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్‌ను ఈ ఫీల్డ్ నుంచి ఉత్పత్తి చేస్తారని అంచనా. కేజీ డీ6 బ్లాక్‌లో ఇప్పటికే ఉన్న హబ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఈ ప్రాజెక్టులు ఉపయోగించుకుంటాయి.

Tags :
|

Advertisement