Advertisement

  • నిధుల రాకతో నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారిన "రిలయెన్స్"

నిధుల రాకతో నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారిన "రిలయెన్స్"

By: chandrasekar Sat, 20 June 2020 4:15 PM

నిధుల రాకతో నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారిన "రిలయెన్స్"


ఇటీవల రిలయెన్స్‌లోకి భారీగా పెట్టుబడులు వచ్చిన సంగతి తెలిసిందే. దాంతో పాటు రైట్స్ ఇష్యూ కూడా పూర్తైంది. ఇవన్నీ సక్సెస్ కావడంతో రిలయెన్స్ అప్పులు లేని కంపెనీగా మారింది. రిలయెన్స్ అప్పులు లేని కంపెనీగా మారిందని ఛైర్మన్ ముఖేష్ అంబానీ ప్రకటించారు గత 58 రోజుల్లో రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ రూ.1,68,818 కోట్లు సేకరించింది.

ప్రపంచంలోని దిగ్గజ ఇన్వెస్టర్ల నుంచి రూ.115,693.95 కోట్లు సేకరించగా, రైట్స్ ఇష్యూ ద్వారా రూ.53,124.20 కోట్లు వచ్చాయి. ఈ నిధుల రాకతో రిలయెన్స్ నెట్ డెట్ ఫ్రీ కంపెనీగా మారింది. 2021 మార్చి నాటికి డెట్ ఫ్రీ కంపెనీగా మారేందుకు ప్రయత్నిస్తామని గతంలోనే ప్రకటించింది రిలయెన్స్. కానీ ఆ లక్ష్యాన్ని చాలా ముందుగానే చేరుకోవడం విశేషం.

2021 మార్చి 31 నాటికి రిలయెన్స్‌ను అప్పులు లేని కంపెనీగా మారుస్తామని షేర్ హోల్డర్లకు ఇచ్చిన వాగ్దానాన్ని చాలా ముందుగానే నేరవేర్చామని చెప్పడం ఆనందంగా ఉంది. మళ్లీ మళ్లీ మా షేర్ హోల్డర్లు, స్టేక్ హోల్డర్ల అంచనాలను మించిపోవడం రిలయెన్స్ డీఎన్ఏలోనే ఉంది.

reliance,become,net debt,free,company ,నిధుల, రాకతో, నెట్ డెట్, ఫ్రీ కంపెనీగా, రిలయెన్స్


రిలయెన్స్ అప్పులు లేని కంపెనీగా మారడం గర్వించదగ్గ సందర్భం. రిలయెన్స్ వ్యవస్థాపకులు ధీరూబాయి అంబానీ ఆశయాల సాధన కోసం, భారతదేశం శ్రేయస్సు, సమగ్ర అభివృద్ధికి మా సహకారాన్ని స్థిరంగా పెంచేందుకు రిలయెన్స్ స్వర్ణ దశాబ్దంలో మరింత ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించడంతో పాటు వాటిని సాధిస్తామని భరోసా ఇస్తున్నాం.

జియో ప్లాట్‌ఫామ్స్‌లో 24.7 శాతం వాటాలను ప్రపంచంలోని దిగ్గజ సంస్థలకు అమ్మడం ద్వారా రిలయెన్స్ ఇండస్ట్రీస్ లిమిడెట్ రూ.115,693.95 కోట్లు సేకరించింది. 9 వారాల్లో 11 డీల్స్ కుదుర్చుకుంది. మరోవైపు రైట్స్ ఇష్యూ 1.59 సార్లు ఎక్కువగా సబ్‌స్క్రైబ్ కావడం మరో విశేషం.

Tags :
|
|

Advertisement