Advertisement

  • డిజిటల్ కొనుగోలుదారులు ఎదురుచూస్తున్న రిలయన్స్ ‘డిజిటల్ ఇండియా సేల్’ .. భారీ ఆఫర్లు...

డిజిటల్ కొనుగోలుదారులు ఎదురుచూస్తున్న రిలయన్స్ ‘డిజిటల్ ఇండియా సేల్’ .. భారీ ఆఫర్లు...

By: chandrasekar Mon, 10 Aug 2020 10:00 AM

డిజిటల్ కొనుగోలుదారులు ఎదురుచూస్తున్న రిలయన్స్ ‘డిజిటల్ ఇండియా సేల్’ .. భారీ ఆఫర్లు...


‘డిజిటల్ ఇండియా సేల్’ మళ్లీ వచ్చింది. రిలయన్స్ డిజిటల్‌కు చెందిన https://www.reliancedigital.in/ వెబ్ సైట్‌లో ఆగస్ట్ 11 వరకు ఈ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్స్ ఉంటాయి. వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్టు రిలయన్స్ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై జియో లో HDFC బ్యాంక్ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి 10 శాతం ఇన్‌స్టంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది. ఈ ఏడాది ‘డిజిటల్ ఇండియా సేల్’ ప్రత్యేకత ‘ప్రతి రోజూ గ్రేట్ డీల్స్’. టీవీలు, హోమ్ అప్లయన్సెస్, మొబైల్ ఫోన్లు, ల్యాప్ టాప్‌లు, యాక్సెసరీస్ మీద ఆఫర్లు ఉన్నాయి.

రిలయన్స్ డిజిటల్ టీవీలపై అందిస్తున్న కొన్ని ఆఫర్లు..

ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 43 అంగుళాలు 4K రూ. 24,990/- నుంచి
ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 55 అంగుళాలు 4K రూ. 33,990/- నుంచి
ఆండ్రాయిడ్ సిరీస్ టీవీలు 32 అంగుళాలు రూ. 11,990/- నుంచి

రిలయన్స్ డిజిటల్ ఫ్రిజ్‌లపై అందిస్తున్న కొన్ని ఆఫర్లు..

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్స్ రూ. 20,990/- నుంచి
ఫ్రాస్ట్ ఫ్రీ రిఫ్రిజిరేటర్స్ రూ. 18,990/- నుంచి
టాప్ లోడ్ వాషింగ్ మెషిన్స్ రూ. 12,490/- నుంచి
డైరెక్ట్ కూల్ రిఫ్రిజిరేటర్స్ రూ. 10,790/- నుంచి

డిజిటల్ ఇండియా సేల్‌లో భాగంగా రిలయన్స్ డిజిటల్‌ టెన్త్ జనరేషన్ ప్రాసెసర్ ల్యాప్ టాప్స్ మీద లాభదాయకమైన ఆఫర్లు ఇస్తోంది. పలుచగా, బరువు తక్కువ ఉండే ల్యాప్ టాప్స్ ధర రూ.22,999/- నుంచి ప్రారంభం అవుతుంది. కన్వర్టబుల్ ల్యాప్ టాప్స్ రూ. 50,999 అలాగే, గేమింగ్ ల్యాప్ టాప్స్ రూ.61,499లో అందుబాటులో ఉన్నాయి. ప్రతి ల్యాప్ టాప్ మీద కచ్చితమైన గిఫ్ట్ (సుమారు రూ.22444 వరకు విలువ చేసే) కూడా ఉంటుంది. దీనికి షరతులు వర్తిస్తాయి. దీనికి అదనంగా బ్రాండ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ల కోసం చూసే వినియోగదారులకు 18 నెలల వారంటీతో సెలక్ట్ మోడల్స్ లభించనున్నాయి.

రిలయన్స్ డిజిటల్ వినియోగోదారులకు ప్రత్యేకంగా వన్ ప్లస్ నోర్డ్ ఆగస్ట్ 10 వరకు అందుబాటులో ఉంటుంది. ఫిట్ నెస్ ప్రియుల కోసం ఫిట్ నెస్ బ్యాండ్స్, స్మార్ట్ వాచీలను 50 శాతం వరకు డిస్కౌంట్ (సెలక్ట్ మోడల్స్) మీద పొందవచ్చు. రిలయన్స్ డిజిటల్ స్టోర్‌లో కచ్చితమైన భద్రత, పరిశుభ్రతా ప్రమాణాలను పాటిస్తున్నట్టు ఆ సంస్థ తెలిపింది. అలాగే, https://www.reliancedigital.in/ ద్వారా కొనుగోలు చేసే వారికి డెలివరీ చేసే సమయంలో కూడా కచ్చితమైన భద్రత, పరిశుభ్రతను పాటిస్తామని తెలిపింది.

Tags :
|

Advertisement