Advertisement

  • కేవలం రెండు గంటల్లోనే కచ్చితమైన ఫలితాన్నిచే కరోనా టెస్ట్ కిట్ ను తయారు చేసిన రిలయన్స్

కేవలం రెండు గంటల్లోనే కచ్చితమైన ఫలితాన్నిచే కరోనా టెస్ట్ కిట్ ను తయారు చేసిన రిలయన్స్

By: Sankar Fri, 02 Oct 2020 7:48 PM

కేవలం రెండు గంటల్లోనే కచ్చితమైన ఫలితాన్నిచే కరోనా టెస్ట్ కిట్ ను తయారు చేసిన రిలయన్స్


దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అయితే కరోనా టెస్టులు కూడా అదే స్థాయిలో జరుగుతున్నాయి ..కానీ ఖచ్చితమైన కరోనా రిజల్ట్స్ రావాలి అంటే తప్పనిసరిగా ఆర్టిపీసీఆర్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది.

అయితే, టెస్ట్ రిజల్ట్ రావాలి అంటే 24కనీసం గంటల సమయం పడుతుంది. ఇక రాపిడ్ యాంటీజెన్ టెస్ట్ ను కూడా చేస్తున్నారు. ఈ టెస్ట్ ఫలితం రావడానికి కనీసం 15 నుంచి 30 నిమిషాల సమయం పడుతుంది. కానీ, ఇది ఖచ్చితమైన ఫలితాలు అని చెప్పలేం. అందుకోసమే రిలయన్స్ లైఫ్ సైన్సెస్ సంస్థ ఆర్టిపీసీఆర్ కిట్ ను అభివృద్ధి చేసింది.

ఈ కిట్ ద్వారా రెండు గంటల్లోనే కరోనా ఫలితాలు రాబట్టొచ్చని లైఫ్ సైన్సెస్ సంస్థ పేర్కొన్నది. దీనికి ఆర్ గ్రీన్ కిట్ గా నామకరణం చేశారు. ఈ కిట్ ఆమోదం కోసం ఐసీఎంఆర్ కు పంపినట్టు తెలిపింది. ఐసిఎంఆర్ ఆమోదం తెలిపితే కమర్షియల్ గా తయారు చేస్తామని రిలయన్స్ లైఫ్ సైన్సెస్ తెలియజేసింది.

Tags :

Advertisement