Advertisement

  • ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

By: chandrasekar Wed, 14 Oct 2020 5:54 PM

ముర‌ళీధ‌ర‌న్ బ‌యోపిక్ మోష‌న్ పోస్ట‌ర్ విడుదల

ప్ర‌పంచ క్రికెట్‌లో శ్రీలంక లెజెండ‌రీ స్పిన్న‌ర్ ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ త‌న స్పిన్ మాయాజాలంతో ప‌లు రికార్డులను న‌మోదు చేసుకున్నారు. అతని బ‌యోపిక్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుడ్ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి లీడ్ రోల్ పోషిస్తున్నాడు.

ఈ చిత్రానికి 800 టైటిల్ ను ఫిక్స్ చేసిన టీం మోష‌న్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేసింది. ముర‌ళీధ‌ర‌న్ జీవితంలోని ప‌లు ద‌శ‌ల‌ను బొమ్మ‌ల రూపంలో చూపిస్తూ సాగే మోష‌న్ పోస్ట‌ర్ సినీ, క్రీడాభిమానుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది.

ప్ర‌‌పంచ క్రికెట్లో ప‌లు రికార్డులు త‌న పేరుపై నమోదు చేసుకున్న ముర‌ళీధర‌న్ వ‌‌న్డేలతోపాటు టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసారు. వ‌న్డేల్లో ముర‌ళీ 534 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 800 వికెట్లు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు నిర్మించ‌బోయే చిత్రం పేరు 800కు ఈ రికార్డే స్ఫూర్తి అని తెలుస్తోంది. 2011లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాక వివిధ టీ20 టోర్నీల్లో ముర‌ళీ ఆడాడు.

అనంత‌రం కోచ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టాడు. ప్ర‌స్తుతం అతను ఐపీఎల్ జ‌ట్టు స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు స్పిన్ కోచ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. ఈ చిత్రంలో ముర‌ళి స్నేహితుడు, ప్ర‌ముఖ క్రికెట‌ర్ క‌మ్ కామెంటేట‌ర్ ర‌సెల్ ఆర్నాల్డ్ పాత్ర‌లో క‌మెడియ‌న్ యోగి బాబు మెర‌వ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

Tags :
|

Advertisement