Advertisement

  • సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌

By: chandrasekar Wed, 05 Aug 2020 7:07 PM

సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాలు విడుద‌ల‌


యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (UPSC) దేశంలోనే అత్యున్న‌త‌స్థాయి ఉద్యోగాల నియామకం కోసం నిర్వ‌హించే సివిల్ స‌ర్వీసెస్ ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను మంగ‌ళ‌వారం విడుద‌ల చేసింది. 2019 సెప్టెంబ‌ర్‌లో మెయిన్స్ ప‌రీక్షలు జ‌రుగ‌గా 2020 ఫిబ్ర‌వ‌రి నుంచి ఆగ‌స్టు వ‌ర‌కు ఇంట‌ర్వ్యూలు నిర్వ‌హించారు.

ఇంట‌ర్వ్యూలో నెగ్గి మొత్తం 829 మంది స‌ర్వీసుల‌కు ఎంపికైన‌ట్లు యూపీఎస్సీ తెలిపింది. ఈ ఏడాది సివిల్ స‌ర్వీసుల‌కు ఎంపికైన వారిలో 304 మంది జ‌న‌ర‌ల్ అభ్య‌ర్థులు కాగా 78 మంది ఈడ‌బ్ల్యూఎస్‌, 251 మంది ఓబీసీ, 129 మంది ఎస్సీ, 67 మంది ఎస్టీ క్యాట‌గిరీల‌కు చెందినవారు ఉన్న‌ట్లు UPSC అధికారులు వెల్ల‌డించారు.

ఫలితాల జాబి‌తాను విడుద‌ల చేశారు. ఆ జాబితాలో ప్ర‌దీప్‌సింగ్ అనే అభ్యర్థి మొద‌టి ర్యాంక్ ద‌క్కించుకోగా జ‌తిన్ కిషోర్ 2వ‌, రాంక్ ప్ర‌తిభా వ‌ర్మ 3వ ర్యాంకు సాధించారు. అభ్య‌ర్థులు త‌మ వెబ్‌సైట్లో ఫ‌లితాల‌ను చూసుకోవ‌చ్చ‌ని UPSC స్ప‌ష్టం చేసింది.

Tags :

Advertisement