Advertisement

  • బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి 'క్యాట్-2020' నోటిఫికేష‌న్ విడుదల

బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి 'క్యాట్-2020' నోటిఫికేష‌న్ విడుదల

By: chandrasekar Fri, 31 July 2020 09:29 AM

బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశానికి 'క్యాట్-2020' నోటిఫికేష‌న్ విడుదల


బిజినెస్ స్కూల్స్‌లో ప్ర‌వేశాల‌కోసం నిర్వ‌హించే కామ‌న్ అడ్మిష‌న్ టెస్ట్ 'క్యాట్-2020' నోటిఫికేష‌న్ విడుద‌ల‌య్యింది. దేశంలోని ఆరు వంద‌ల‌కు పైగా ఉన్న‌విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కొరకు నోటిఫికేష‌న్ విడుదల చెయ్యబడింది. ఐఐఎంల‌లో ఉన్న‌త విద్య అభ్య‌సించాల‌నుకునేవారు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చ‌ని ఐఐఎం-ఇండోర్ ప్ర‌క‌టించింది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ఆగస్టు 5న ప్రారంభ‌మై, సెప్టెంబ‌ర్ 16 వ‌ర‌కు అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. ఈ ఏడాది ప్రతిష్ఠాత్మ‌క క్యాట్‌ను ఐఐఎం ఇండోర్ నిర్వ‌హించ‌నుంది.

ఈ ప్ర‌వేశ ప‌రీక్ష న‌వంబ‌ర్ 29న జ‌ర‌గ‌నుంది. అడ్మిట్ కార్డుల‌ను అక్టోబ‌ర్ 28 నుంచి ప‌రీక్ష తేదీవ‌ర‌కు డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. అయితే అభ్య‌ర్థులు క్యాట్‌కు సంబంధించిన వివ‌రాల‌కోసం అధికారిక వెబ్‌సైట్ iimcat.ac.inలో ఎప్ప‌టిక‌ప్పుడు చెక్‌చేసుకోవాల‌ని తెలిపింది. క్యాట్ ప‌రీక్ష‌లో మూడు విభాగాలు ఉంటాయి. వెర్బ‌ల్ ఎబిలిటీ అండ్ రీడింగ్ కాంప్ర‌హెన్ష‌న్‌, డాటా ఇంట‌ర్‌ప్రిటేష‌న్ అండ్ లాజిక‌ల్ రీజ‌నింగ్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప‌రీక్ష మొత్తం మూడు గంట‌ల‌పాటు ఉంటుంది. ప్ర‌తి ఏడాది ఈ ప్ర‌వేశ‌ప‌రీక్ష‌ను 2 ల‌క్ష‌ల‌కుపైగా విద్యార్థులు రాస్తారు. మొత్తం 156 న‌గ‌రాల్లో ఈ ప్ర‌వేశ‌ప‌రీక్షను నిర్వ‌హిస్తారు.

* ద‌‌ర‌ఖాస్తు చేయు విధానం‌: ఆన్‌లైన్‌లో
* ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: ఆగ‌స్టు 5 నుండి
* పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తులు చివ‌రి తేదీ: సెప్టెంబ‌ర్ 16
* అడ్మిట్‌కార్డ్ డౌన్‌లోడ్‌: అక్టోబ‌ర్ 28
* ప‌రీక్ష తేదీ: న‌వంబ‌ర్ 29, 2020
* పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: iimcat.ac.in


Tags :

Advertisement