Advertisement

  • కరోనా పాజిటివ్ వచ్చిన బాలింత ..ఆసుపత్రి నుంచి మిస్సింగ్

కరోనా పాజిటివ్ వచ్చిన బాలింత ..ఆసుపత్రి నుంచి మిస్సింగ్

By: Sankar Tue, 16 June 2020 1:42 PM

కరోనా పాజిటివ్ వచ్చిన బాలింత ..ఆసుపత్రి నుంచి మిస్సింగ్



హైదరాబాద్‌లో ఓ బాలింతకు కరోనా పాజిటివ్ అని తేలగా.. ఆమెను గాంధీ హాస్పిటల్‌కు తరలించేలోపే బంధువులు తల్లీబిడ్డను తీసుకొని వెళ్లిపోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. హఫీజ్ బాబానగర్‌కు చెందిన ఓ మహిళ ప్రసవం కోసం జూన్ 8న పాతబస్తీలోని బేలా సూరజ్భాన్ హాస్పిటల్లో చేరింది. మరుసటి రోజు సిజేరియన్ చేయగా.. బాబు జన్మించాడు. నాలుగు రోజుల క్రితం ఆమెకు దగ్గు, జలుబు మొదలైంది.

దీంతో కరోనా సోకిందనే అనుమానంతో డాక్ట‌ర్లు ఆమెను వేరే గదికి మార్చి శాంపిళ్లను సేకరించారు. టెస్టులకు పంపగా.. సోమవారం వచ్చిన రిపోర్టులో పాజిటివ్ అని తేలింది. దాంతో ఆమెను గాంధీ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేయాలని కుటుంబ సభ్యులకు డాక్టర్లు చెప్పారు. కానీ డాక్ట‌ర్లు తప్పుగా చెబుతున్నారని.. బాలింత కుటుంబ సభ్యులు గొడవపడ్డారు. దీంతో చేసేదేం లేక హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు.

కానీ పోలీసులు వచ్చేలోపే కుటుంబ సభ్యులు బాలింతను, శిశును తీసుకుని వెళ్లిపోయారు. కరోనా సోకిన మహిళను చెప్పాపెట్టకుండా తీసుకెళ్లడంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఆ మహిళకు చికిత్స అందించే క్రమంలో కాంటాక్ట్ అయిన డాక్ట‌ర్లు, ఐదుగురు నర్సులు తమకు ఎక్కడ కరోనా సోకుతుందోనని ఆందోళన చెందుతున్నారు. వారందరి నుంచి శాంపిళ్లను సేకరించి టెస్టులకు పంపారు. కరోనా పాజిటివ్ అని తేలిన బాలింతకు చికిత్స అందించిన వార్డులోనే మరో పది మంది బాలింతలు ఉన్నారని తెలుస్తోంది.



Tags :
|

Advertisement