Advertisement

  • అమెరికా, ఇజ్రాయెల్‌కు గ్రహాంతరవాసులతో రిలేషనా...?

అమెరికా, ఇజ్రాయెల్‌కు గ్రహాంతరవాసులతో రిలేషనా...?

By: chandrasekar Tue, 08 Dec 2020 6:49 PM

అమెరికా, ఇజ్రాయెల్‌కు గ్రహాంతరవాసులతో రిలేషనా...?


గ్రహాంతర వాసులు ఈ విశ్వంలో ఎక్కడున్నారనేది ఓ అంతుచిక్కని ప్రశ్న కానీ, దశాబ్దాలుగా గ్రహాంతరవాసులకూ అమెరికా పాలకులకూ డీల్స్ కొనసాగుతున్నాయనీ అమెరికాలోని ఏరియా 51లో రహస్యంగా గ్రహాంతర వాసుల కోసం అమెరికా చాలా కార్యక్రమాలు చేస్తోందనే ప్రచారం ఏళ్లుగా ఉన్నదే. ఈ ఆరోపణలకు కచ్చితమైన ఆధారాలు లేకపోవడంతో వీటిని నమ్మాలా వద్దా అనే దానిపై ప్రజల్లో అనేక సందేహాలు ఉన్నాయి. ఐతే తాజాగా ఇజ్రాయెల్ స్పేస్ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఈ ఆరోపణలకు ఆజ్యం పోస్తున్నాయి. "ఎన్నో ఏళ్లుగా అమెరికా, ఇజ్రాయెల్, ఏలియన్స్‌ మధ్య కాంటాక్స్ కొనసాగుతున్నాయి. దీనిపై ప్రపంచమంతా చర్చించుకుంటూనే ఉంది" అంటూ షాకింగ్ ప్రకటన చేశారు ఇజ్రాయెల్‌కి 30 ఏళ్ల పాటూ అంతరిక్ష రక్షణ చీఫ్‌గా వ్యవహరించిన హెయిమ్ షెడ్. హెయిమ్ షెడ్ సాధారణ వ్యక్తి కాదు. మూడు సార్లు ఇజ్రాయెల్ సెక్యూరిటీ అవార్డ్ పొందిన వ్యక్తి. ఎంతో పేరున్న వ్యక్తి. అలాంటి ఆయన ఇలాంటి ప్రకటన చేయడం చర్చకు దారితీసింది. గ్రహాంతర వాసులతో డీల్స్ విషయాన్ని బయటపెడితే ప్రజల్లో గందరగోళం తలెత్తుతుందనే ఉద్దేశంతోనే తాను ఈ విషయాన్ని రహస్యంగా ఉంచానని చెప్పినట్లు జెరుసలేం పోస్ట్ రిపోర్ట్ చేసింది.

గెలాక్టిక్ ఫెడరేషన్ ఆఫ్ ఏలియన్స్ అనే వ్యవస్థ ఒకటి ఉందని హెయిమ్ షెడ్ అంటున్నారు. ఈ వ్యవస్థలోని ఏలియన్స్‌తో అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నాయని వివరించారు. గ్రహాంతరవాసులు ఈ ప్రపంచాన్ని పరిశీలిస్తున్నారనీ, అధ్యయనం చేస్తున్నారని వివరించారు. మార్స్ గ్రహంపై ఓ సీక్రెట్ అండర్‌గ్రౌండ్ నిర్మాణం నిర్మించి ఇస్తామని అమెరికా... ఏలియన్స్‌తో డీల్ కుదుర్చుకుందట. ఏలియన్స్‌కి సంబంధించిన ప్రతినిధులు అమెరికాలో ఉన్నారని హెయిమ్ అంటున్నారు. ఈమధ్యే అమెరికా ఆర్మీలో స్పేస్ ఫోర్స్ అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారనీ ఇందుకు కారణం ఏలియన్సే అని ఆయన అంటున్నారు.

అమెరికా, ఏలియన్స్ సంబంధాలు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి తెలుసన్న హెయిమ్ ఈ విషయాన్ని ప్రపంచానికి చెప్పాలని ట్రంప్ అనుకున్నారనీ కానీ గెలాక్టిక్ ఫెడరేషన్ ఆయన్ని బ్యాన్ చేసిందని అన్నారు. ఇప్పట్లో ఈ విషయం ప్రపంచానికి తెలియకూడదని గెలాక్టిక్ ఫెడరేషన్ భావిస్తోందనీ భవిష్యత్తులో తనకు నచ్చినప్పుడు చెప్పాలనుకుంటోందని తెలిపారు. ఈ విషయాన్ని తాను ఇదివరకే చెప్పి ఉంటే తనకు మానసిక అనారోగ్యం వచ్చిందనే నెపం వేసి తనను బంధించేవారని అన్న ఆయన తనకు తెలిసింది చెప్పానన్నారు. అంతా ఆసక్తిగానే ఉన్నా ఈ ప్రొఫెసర్ చెప్పిన విషయాలకు ఆధారాలేవీ చూపలేదు. అందువల్ల వీటిని నమ్మాలా లేదా అన్నది ఎవరికి వారు ఆలోచించుకోవాల్సిందే. అంతేకాదు ఏలియన్స్ అమెరికాను కంట్రోల్ చేస్తున్నట్లైతే వారు మన కంటే ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వారే అనుకోవాల్సి ఉంటుంది. మరి అంత టెక్నాలజీ తెలిసిన వారు మార్స్‌పై తమకు కావాల్సినవి తామే నిర్మించుకోవచ్చుగా మనుషులతో డీల్స్ ఎందుకన్న ప్రశ్న తలెత్తుతుంది. ఇలాంటి ఎన్నో ఆరోపణలు ఉన్నా వేటికీ ఇప్పటివరకూ అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పందించలేదు. అందువల్ల ఇదంతా నమ్మాలా లేదా అన్నది మరో ప్రశ్నగా మారింది.

Tags :
|

Advertisement