Advertisement

  • 25 స్కూళ్లలో కూడా టీచర్‌గా నమోదు: ప్రభుత్వ టీచర్ ఆదాయం ఏడాదికి రూ.కోటి

25 స్కూళ్లలో కూడా టీచర్‌గా నమోదు: ప్రభుత్వ టీచర్ ఆదాయం ఏడాదికి రూ.కోటి

By: chandrasekar Sat, 06 June 2020 12:33 PM

25 స్కూళ్లలో కూడా టీచర్‌గా నమోదు: ప్రభుత్వ టీచర్ ఆదాయం ఏడాదికి రూ.కోటి


ఒక ప్రభుత్వ టీచర్ ఆదాయం ఎంత ఉంటుంది సీనియారిటీని బట్టి భారీగా అయితే, ఏడాదికి రూ.12 లక్షల నుంచి రూ.15లక్షల వరకు ఉంటుంది. ఆ ప్రభుత్వ టీచర్ ఆదాయం ఏకంగా ఏడాదికి రూ.కోటి. అంత డబ్బు ఎలా సంపాదిస్తుందని అనుకుంటున్నారా ఉత్తర్ ప్రదేశ్‌లోని కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయలో అనామికా శుక్లా అనే టీచర్ పనిచేస్తోంది.

ఆమె ఒకే సారి మరో 25 స్కూళ్లలో కూడా టీచర్‌గా నమోదు చేసుకుంది. ఒక్క జిల్లాలోనే కాదు. అమేథీ, అంబేద్కర్ నగర, రాయ్ బరేలీ, ప్రయాగరాజ్, అలిగఢ్, మరికొన్ని జిల్లాల్లో కూడా ఆమె టీచర్‌గా పని చేస్తున్నట్టు నమోదు చేసుకుంది.దీంతో ఆమెకు ప్రతి చోటా జీతాలు పడుతూనే ఉన్నాయి. అలా ఒక నెల కాదు. రెండు నెలలు కాదు. సుమారు 13 నెలల పాటు ఆమె ఇలా జీతం తీసుకుంది.

ఉత్తర్ ప్రదేశ్‌లో ప్రాథమిక విద్యకు సంబంధించి అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది టీచర్లు ఉన్నారు? విద్యార్థులు, టీచర్ల నిష్పత్తి ఎలా ఉందనే విషయం తెలుసుకోవడానికి ఓ డేటాబేస్‌ను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఈ క్రమంలో అనామికా శుక్లా పేరు, ఆధార్ కార్డు నెంబర్ వివరాలు ఒకేసారి 25 స్కూళ్లలో కనిపించాయి.

ఒక టీచర్ ఇలా 25 స్కూళ్లలో ఎలా పనిచేయగలదు అసలు ఇదెలా సాధ్యమైందని అంశాలను అధికారులు ఆరా తీశారు. ఆమె ఒకే బ్యాంక్ అకౌంట్‌ ద్వారా ప్రభుత్వం నుంచి వేతనం తీసుకుందా అని తెలుసుకుంటున్నారు. దీనిపై విచారణకు ఆదేశించారు. సుమారు 13 నెలల కాలంలోఆమె మొత్తం రూ.కోటి మేర జీతం తీసుకున్నట్టు తెలిసింది.

Tags :

Advertisement