Advertisement

ఏపీలో మద్యం ధరల్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం

By: chandrasekar Fri, 30 Oct 2020 4:37 PM

ఏపీలో మద్యం ధరల్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం


ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తుండడంతో ఏపీ ప్రభుత్వం మద్యం తగ్గి౦చడానికి నిర్ణయించింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచడంతో పాటు భారీ సంఖ్యలో మద్యం దుకాణాలు మూసివేయడంతో మందుబాబులు తెలంగాణ, కర్ణాటక వైపు చూస్తున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుబాబులకు శుభవార్త చెప్పింది. ఏపీలో మద్యం ధరల్ని తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో తగ్గిన మద్యం ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ విధంగా ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తూ నిత్యం ఎంతో మంది పట్టుబడుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం మద్యం తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. మద్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తమ ఉత్తర్వులలో పేర్కొన్నారు.

దేశీయంగా తయారయ్యే విదేశీ మద్యం (ఐఎంఎఫ్ఎల్)లో మధ్య, ఉన్నత శ్రేణి బ్రాండ్ల ధరలు తగ్గించింది. కనీసం రూ.50 నుంచి రూ.1350 వరకు పలు బ్రాండ్ల మద్యం ధరలు తగ్గించినట్లు సమాచారం. రెడీ టు డ్రింక్ మద్యం ధరలు యథాతథంగా కొనసాగనున్నాయి. క్వార్టర్ బాటిల్ ధర రూ.200లోపు ఉండే వాటి ధరలలో ఏ మార్పు లేదని, అంతకు పైగా ఉండే ధరలు మాత్రమే తగ్గించారు. ఎస్ఈబీ నివేదిక ఆధారంగా ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను తగ్గించినట్లు పేర్కొంది. ఐఎంఎఫ్‌ఎల్‌ బ్రాండ్లలో అధికంగా ధరలు సవరించినట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. అక్టోబర్ 30 నుంచి తగ్గించిన మద్యం ధరలు అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది.

Tags :
|
|

Advertisement