Advertisement

తగ్గిన బంగారం ధర...

By: chandrasekar Wed, 25 Nov 2020 9:09 PM

తగ్గిన బంగారం ధర...


అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ అనూహ్యంగా తగ్గడంతో దేశీయంగానూ వీటి రేట్లు భారీగా పడిపోయాయి. ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ.1,049 తగ్గి రూ.48,569కి జారుకుంది. కిలో వెండి సైతం ఒక్కరోజులో రూ.1,588 తగ్గి రూ.59,301కి పడిపోయింది.

మంగళవారం ముంబై మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత గల పది గ్రాముల బంగారం ధర రూ.48,975గా నమోదైంది. కిలో వెండి రూ.59,704 వద్ద క్లోజైంది. కరోనా వ్యాక్సిన్‌ త్వరలోనే అందుబాటులోకి రానుందన్న ఆశలతోపాటు అమెరికాలో వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన డేటా అంచనాలను మించడంతో అమెరికన్‌ ఈక్విటీ మార్కెట్లలో ఉత్సాహం పెరిగింది.

ఆర్థిక అనిశ్చితి తగ్గుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి పెట్టుబడులను క్రమంగా ఉపసంహరించుకుంటున్నారు. తత్ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) బంగారం 1,810 డాలర్లు, వెండి 23 డాలర్ల స్థాయికి పడిపోయాయి.

Tags :
|

Advertisement