Advertisement

  • రెడ్ మీ 9 ప్రైమ్ సేల్ ఈరోజే ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!

రెడ్ మీ 9 ప్రైమ్ సేల్ ఈరోజే ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!

By: chandrasekar Mon, 24 Aug 2020 10:27 PM

రెడ్ మీ 9 ప్రైమ్ సేల్ ఈరోజే ధర, స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఇవే!


షియోమీ రెడ్ మీ 9 ప్రైమ్ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని సేల్ మనదేశంలో సోమవారం, ఆగస్టు 24వ తేదీ ప్రారంభం కానుంది. మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలను అందించారు. 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే కూడా ఇందులో ఉంది. మీడియం బడ్జెట్ రేటు లో దీనిని విడుదల చేస్తున్నారు. ఇందులో రెండు వేరియంట్లను షియోమీ అందించనుంది. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గానూ, 4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.11,999గానూ నిర్ణయించారు.

రెడ్ మీ 9 ప్రైమ్ స్పెసిఫికేషన్స్:

* ఈ స్మార్ట్ ఫోన్ లో 6.53 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఐపీఎస్ డిస్ ప్లే ఉంది.
* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇందులో అందించారు.
* ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ80 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.
* ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ మాక్రో షూటర్, 2 మెగా పిక్సెల్ డెప్త్ షూటర్ లు కూడా ఉన్నాయి.
* సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగా పిక్సెల్ కెమెరాను అందుబాటులో ఉంది.
* ర్యామ్ సామర్థ్యం 4 జీబీగా ఉంది.
* ఇందులో 128 జీబీ స్టోరేజ్ ను అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.
* ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై రెడ్ మీ 9 ప్రైమ్ పనిచేయనుంది.
* బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ ను ఇది సపోర్ట్ చేయనుంది.
* 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఐఆర్ బ్లాస్టర్, యూఎస్ బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
* ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ వెనక భాగంలో ఉంది.
* ఈ ఫోన్ మందం 0.91 సెంటీమీటర్లుగానూ, బరువు 198 గ్రాములుగానూ ఉన్నాయి.
* స్పేస్ బ్లాక్, మింట్ గ్రీన్, మాటే బ్లాక్, సన్ రైజ్ ఫ్లేర్ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

Tags :
|

Advertisement