Advertisement

  • రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ కు కొత్త మోడల్ నంబర్ తో అప్ డేట్

రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ కు కొత్త మోడల్ నంబర్ తో అప్ డేట్

By: chandrasekar Wed, 12 Aug 2020 2:31 PM

రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ కు కొత్త మోడల్ నంబర్ తో  అప్ డేట్


పోకో ఎక్స్2 స్మార్ట్ ఫోన్ కు ఎంఐయూఐ 12 అప్ డేట్ లభించింది. రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ కు MIUI V12.0.1.0.QJOINXM మోడల్ నంబర్ తో ఈ అప్ డేట్ వచ్చింది. దీని సైజు 538 ఎంబీగా ఉంది. దీంతో ఎంఐయూఐ 12 ఫీచర్లన్నీ ఈ ఫోన్లకు కూడా రానున్నాయి. ఈ ఎంఐయూఐ 12 అప్ డేట్ ద్వారా కొత్త యానిమేషన్ ఇంజిన్, కొత్త విజువల్ డిజైన్ ను అందించనున్నారు. అయితే ఈ స్క్రీన్ షాట్ మార్పులు, ఫీచర్ల గురించి ఎక్కువ వివరాలు వెల్లడించలేదు. అయితే ఎంఐయూఐ 12 లాంచ్ సమయంలోనే దీనికి సంబంధించిన ఫీచర్లన్నీ షియోమీ వెల్లడించింది.

ఫ్లోటింగ్ విండోస్, సింపుల్ డిజైన్, ప్రైవసీ, సెక్యూరిటీ విషయంలో కొత్త మార్పులు కూడా షియోమీ చేసింది. కొత్త కంట్రోల్ సెంటర్ డిజైన్ ను కూడా ఇందులో అందించారు. మీ రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ కు ఈ అప్ డేట్ వచ్చిందో లేదో తెలుసుకోవడానికి సెట్టింగ్స్ లో అబౌట్ ఫోన్ లోకి వెళ్లి సిస్టం అప్ డేట్ మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఈ అప్ డేట్ కనిపిస్తుంది. ఒక్కోసారి మీకు ఈ అప్ డేట్ నోటిఫికేషన్ ద్వారా కూడా వస్తుంది.

రెడ్ మీ నోట్ 9 స్మార్ట్ ఫోన్ జులై ద్వితీయార్థంలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేస్తుంది.

దీనిలో ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ను అందించారు. 6 జీబీ వరకు ర్యామ్ ను దీనిలో అందించారు.

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. ముందువైపు సింగిల్ హోల్-పంచ్ కట్ అవుట్ ను దీనిలో అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5020 ఎంఏహెచ్ గా ఉంది. 22.5W ఫాస్ట్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. 9W రివర్స్ చార్జింగ్ ను కూడా ఇది సపోర్ట్ చేస్తుంది.

Tags :
|
|

Advertisement