Advertisement

  • రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు

రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు

By: chandrasekar Mon, 14 Dec 2020 3:53 PM

రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు


దేశంలో రోజుకో స్మార్ట్ ఫోన్ విడులవుతున్న ఈ సమయంలో రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపును ప్రకటించింది. ధరలో తగ్గింపువల్ల ఈ ఫోన్ ధర రూ.16,999 నుంచి రూ.13,999కు తగ్గింది. ఈ తగ్గింపుకు దేశంలో వున్న పోటీయే కారణంగా తెలిస్తుంది. దీంతో ఒకేసారి ఏకంగా రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. రెడ్ మీ నోట్ 9 ప్రో ఫోన్ రెండు వేరియంట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 4 జీబీ ర్యామ్ తో ఫోన్ 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా ఉండగా, రూ.3,000 తగ్గించి దీన్ని రూ.13,999కు గాను అదేవిధంగా 4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999 నుంచి రూ.14,999కు తగ్గించారు. ఈ ఫోన్ అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

* రెడ్ మీ నోట్ 9 ప్రో 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్ ప్లేను అందించారు. ఈ ఫోన్ డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.

* ఈ ఫోన్ లో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌ను ఇందులో అందించారు.

* ఈ మొబైల్ ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 720జీ ప్రాసెసర్ పై రెడ్ మీ నోట్ 9 ప్రో పనిచేయనుంది. ఫోన్ లో మ్యాప్ కోసం ఇస్రో నావిగేషన్ సిస్టం నావిక్ సపోర్ట్ ను కూడా ఇందులో అందించారు.

* ఈ ఫోన్ లో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగా పిక్సెల్ గాను, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గాను, 5 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్ గాను, 5 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లను కూడా ఇందులో పొందుపరిచారు.

* ముందువైపు సెల్ఫీ ప్రియుల కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంచారు.

* ఈ ఫోన్ దీని బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు.

* ఇందులో 4జీ వోల్టే, వైఫై 802.11ac, బ్లూటూత్ v5.0, ఇన్ ఫ్రారెడ్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

* ఈ ఫోన్ 0.88 మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. తాజాగా ఎంఐయూఐ 12 అప్ డేట్‌ను కూడా ఈ ఫోన్ అందుకుంది.

Tags :
|

Advertisement