Advertisement

  • రెడ్ మీ 10ఎక్స్ అనే స్మార్ట్ ఫోన్ సేల్స్: 5 నిమిషాల్లోరూ.100 కోట్లు

రెడ్ మీ 10ఎక్స్ అనే స్మార్ట్ ఫోన్ సేల్స్: 5 నిమిషాల్లోరూ.100 కోట్లు

By: chandrasekar Fri, 05 June 2020 12:40 PM

రెడ్ మీ 10ఎక్స్ అనే స్మార్ట్ ఫోన్ సేల్స్: 5 నిమిషాల్లోరూ.100 కోట్లు


ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ తాజాగా రెడ్ మీ 10ఎక్స్ అనే స్మార్ట్ ఫోన్ ను చైనాలో లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ షియోమీపై కనకవర్షం కురిపించింది. కేవలం ఐదు నిమిషాల్లో మొత్తంగా రూ.100 కోట్లు విలువచేసే స్మార్ట్ ఫోన్లు అమ్ముడుపోయాయి. వీటిలో ఎక్కువగా రెడ్ మీ 10ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ కు సంబంధించిన 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్లు పూర్తిగా అమ్ముడుపోగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లు ఎంఐ.కాంలో ఇందులో ఇంకా అందుబాటులో ఉన్నాయి.

సంఖ్య పరంగా చూసుకుంటే షియోమీ దాదాపు 50 వేల రెడ్ మీ 10ఎక్స్ స్మార్ట్ ఫోన్లను ఒకే సేల్ లో విక్రయించింది. రెడ్ మీ 10ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ లో 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. హెచ్ డీఆర్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది. ర్యామ్ 8 జీబీ, స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది. వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ను అందించారు.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు. ఇందులో 4520 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. 22.5W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ మోడ్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బరువు 205 గ్రాములు.

redmi,smartphone,sales,crores,minutes ,రెడ్ మీ, ఎక్స్, అనే స్మార్ట్, ఫోన్ సేల్స్,  నిమిషాల్లోరూ


రెడ్ మీ 10ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ లో కూడా 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేనే అందించారు. హెచ్ డీఆర్10 సపోర్ట్ కూడా ఇందులో ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 820 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ర్యామ్ 8 జీబీ వరకు, స్టోరేజ్ 256 జీబీ వరకు ఉంది. వెనకవైపు నాలుగు కెమెరాల సెటప్ ను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 8 మెగా పిక్సెల్ టెలిఫొటో షూటర్, 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగా పిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బరువు 208 గ్రాములు. ఇందులో కూడా 4520 ఎంఏహెచ్ బ్యాటరీనే అందించారు. 33W ఫాస్ట్ చార్జింగ్ ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. డ్యూయల్ మోడ్ 5జీ సపోర్ట్, బ్లూటూత్ వీ5.1, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్ బీ టైప్-సీ పోర్ట్, వైఫై వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.

Tags :
|
|
|

Advertisement