Advertisement

రికవరీ రేట్ పెరుగుతుంది ..లవ్ అగర్వాల్

By: Sankar Wed, 24 June 2020 7:53 PM

రికవరీ రేట్ పెరుగుతుంది ..లవ్ అగర్వాల్



దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు ..రోజు రోజుకి రికార్డు స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి ..అయితే కేసులు ఎంత పెరుగుతున్నాయి రికవరీ అయ్యే వాళ్ళ సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది ..అమెరికా , ఇటలీ , స్పెయిన్ , వంటి దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కరోనా కేసుల వలన చనిపోయే వారి సంఖ్య చాల తక్కువగా ఉంది ..భారత్‌లో ఇప్పటివరకు 2,58,684 మంది రికవరీ అయ్యారని వెల్లడించింది. దీంతో రికవరీ రేటు 56.71 శాతంగా ఉందని ప్రకటించింది. ప్రస్తుతం 1,83,022 యాక్టివ్‌ కేసులు ఉన్నట్టు ఆరోగ్యశాఖ చెప్పింది.

ఇక గత కొన్ని రోజులుగా తీసుకున్న పటిష్ట చర్యలతో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో గొప్ప పురోగతి సాధ్యమైందని వైద్యారోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్ అన్నారు. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో రెండు లక్షల కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు. ఒక రోజులో 2,15,195 పరీక్షలు చేయడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. వీటిలో 1,71,587 పరీక్షలు ప్రభుత్వ ల్యాబుల్లో, 43,608 పరీక్షలు ప్రైవేటు ల్యాబుల్లో జరిగాయని చెప్పారు. ప్రైవేటు ల్యాబుల్లో ఇన్ని పరీక్షలు చేయడం కూడా రికార్డే అని లవ్‌ అగర్వాల్‌ తెలిపారు.

దేశవ్యాప్తంగా 1000 ల్యాబ్ లలో కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. వాటిలో 730 ప్రభుత్వ, 270 ప్రవేటు ల్యాబులు ఉన్నాయని తెలిపారు. దేశంలో ఇప్పటివరకు 73,52,911 పరీక్షలు చేశామని అన్నారు..

Tags :
|

Advertisement