Advertisement

  • అదుపుతప్పి బావిలో పడిన జీపు డ్రైవర్‌ మృతదేహం వెలికితీత

అదుపుతప్పి బావిలో పడిన జీపు డ్రైవర్‌ మృతదేహం వెలికితీత

By: chandrasekar Wed, 28 Oct 2020 1:44 PM

అదుపుతప్పి బావిలో పడిన జీపు డ్రైవర్‌ మృతదేహం వెలికితీత


వరంగల్‌ రూరల్: జిల్లాలోని సంగెం మండలం గవిచర్ల వద్ద అదుపుతప్పి బావిలో పడిన జీపు ఘటనలో పోలీసులు జీపు డ్రైవర్‌ మృతదేహాన్ని వెలికితీశారు. వరంగల్‌ నుంచి నెక్కొండకు వెళ్తుండగా వరంగల్‌ నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీసులు మొదటగా జేసీబీతో సహాయక చర్యలను ప్రారంభించారు. కాని బావి లోతు 30 అడుగులు ఉండటంతో క్రేన్‌ను తీసుకువచ్చి సహాయక చర్యలు చేపట్టారు. జీపు డ్రైవర్‌ సతీశ్‌ను ఏనుగల్లుకు చెందిన నివాసిగా గుర్తించారు.

ఏసీపీ శ్యామ్‌సుందర్‌ మాట్లాడుతూ.. స్థానికులు, పోలీసు సిబ్బంది సహాయంతో జీపు నుంచి 10 మందిని సురక్షితంగా రక్షించినట్లు తెలిపారు. వీరిలో ఐదుగురు మహిళలు, ఐదుగురు పురుషులు ఉన్నారన్నారు.

జీపు డ్రైవర్‌తో సహా మరో ముగ్గురు బావిలోనే మృతిచెందినట్లుగా భావిస్తున్నామన్నారు. డ్రైవర్‌ మృతదేహం వెలికితీయగా మిగతా వారి ఆచూకీ కోసం ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయన్నారు. డ్రైవర్‌కు ఫిట్స్‌ రావటం వల్లే ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Tags :

Advertisement