Advertisement

  • కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో 21 ఏళ్ల యువ మేయర్‌ గా రికార్డు

కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో 21 ఏళ్ల యువ మేయర్‌ గా రికార్డు

By: chandrasekar Fri, 25 Dec 2020 11:54 PM

కేరళ రాష్ట్రంలోని  తిరువనంతపురంలో  21 ఏళ్ల యువ మేయర్‌ గా రికార్డు


కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం మేయర్‌గా 21 ఏళ్ల 'ఆర్య రాజేంద్రన్' బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆమె భారతదేశపు మొదటి యువ మేయర్ గా గుర్తింపు పొందారు. ఇటీవల కేరళ స్థానిక ఎన్నికలు నిర్వహించింది. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ మెజారిటీ స్థానాలను గెలుచుకుంది. ప్రస్తుతం పంచాయతీ బోర్డు, వార్డ్ కౌన్సిలర్, మేయర్ పదవులకు ఎన్నికైన వారు ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ప్రస్తుతం ముదవణ్ముగల్ వార్డ్ కౌన్సిలర్ 'ఆర్య రాజేంద్రన్' తిరువనంతపురం మెట్రోపాలిటన్ కార్పొరేషన్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. సీపీఎమ్ పార్టీ ఇప్పుడు ఈ 21 ఏళ్ల యువతిని కొత్త మేయర్‌గా ప్రకటించింది.

'ఆర్య రాజేంద్రన్' ఆల్ సెయింట్స్ కాలేజీ నుండి గణితంలో బిఎస్సి ని పూర్తిచేశారు. ఆమె తన కళాశాల రోజుల నుండి ఎస్ఎఫ్ఐ స్టేట్ కమిటీ సభ్యురాలుగా మరియు ఛైర్మన్‌గా ఉన్నారు. ఆమె సిపిఎం కేశవదేవ్ రోడ్ బ్రాంచ్ కమిటీ సభ్యురాలుగాను మరియు బాలాజన్ సంఘ్ రాష్ట్ర అధ్యకస్థురాలుగా కూడా వున్నారు. కమ్యూనిస్టు పార్టీ తరపున ఎన్నికల్లో గెలిచి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించనున్న 'ఆర్య రాజేంద్రన్' భారతదేశపు అతి పిన్న వయస్కురాలుగా మేయర్‌గా గుర్తింపు పొందారు.

Tags :

Advertisement