Advertisement

గత పదేళ్లలో రాజధానిలో ఇదే భారీ వర్షం...

By: Sankar Thu, 01 Oct 2020 11:25 AM

గత పదేళ్లలో రాజధానిలో ఇదే భారీ వర్షం...


తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఈ ఏడాది భారీ వర్షాలు కురిశాయి..గత పది సంవత్సరాలలో ఇంత భారీ వర్షాలు పడలేదు. వరద సమస్యను శాశ్వతoగా పరిష్కరించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు ఇటీవల జిహెచ్ఎంసి కమీషనర్, జోనల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ అధికారులు తో ప్రత్యేకంగా చర్చించారు.

వర్షపు నీరు ఎటువంటి ఆటంకాలు లేకుండా సమీపంలోని చెరువులు, కుంటలు, మూసీలోకి ప్రవహించేందుకు వరద నీటి డ్రెయిన్ల ను పటిష్టపరిచేందుకు, దెబ్బతిన్న నాలాలను మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని జోనల్ కమీషనర్లను ఆదేశించారు. తదనుగుణంగా జోనల్ కమీషనర్లు, ఇంజనీరింగ్ అధికారులతో కలిసి అన్ని రోడ్లు , కాలనీలలో పర్యటించారు. ప్రతి నాలాను, నీరు నిలుస్తున్న ప్రదేశాలను పరిశీలించి, అధ్యయనం చేశారు. కొత్తగా నాలాలు నిర్మించాల్సిన ఏరియా లను గుర్తించారు.

మరమ్మతులు అవసరం ఉన్న నాలాలు, రక్షణ చర్యలు గురించి రెండు మీటర్లు వెడల్పు లోపు వుండే వరద నీటి డ్రైయిన్స్, రెండు మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు ఉన్న డ్రైయిన్స్ గా విభజించి మొత్తం రూ.298 కోట్ల 34 లక్షల అంచనా వ్యయంతో 472 పనులకు ప్రతిపాదనలు రూపొందించి, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు కి నివేదించారు.ఈ పనులను పరిశీలించిన మంత్రి కెటిఆర్ ఆమోదించారు. దాంతో పనులు చేపట్టుటకు పురపాలక శాఖ పరిపాలన అనుమతులను జారీచేసింది.

Tags :
|

Advertisement