Advertisement

  • ప్రభుత్వం నుంచి ఐపీయల్ నిర్వహణకు అనుమతి పత్రాలు అందాయి ..ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్

ప్రభుత్వం నుంచి ఐపీయల్ నిర్వహణకు అనుమతి పత్రాలు అందాయి ..ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్

By: Sankar Mon, 10 Aug 2020 8:03 PM

ప్రభుత్వం నుంచి ఐపీయల్ నిర్వహణకు అనుమతి పత్రాలు అందాయి ..ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్



క‌రోనా కార‌ణంగా నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజ‌న్‌ను యూఏఈ కేంద్రంగా నిర్వ‌హించేందుకు కేంద్ర ప్ర‌భుత్ం నుంచి అనుమ‌తి ల‌భించింద‌ని ఐపీఎల్ చైర్మ‌న్ బ్రిజేశ్ ప‌టేల్ అన్నారు. యూఏఈలోని షార్జా, దుబాయ్‌, అబుదాబీలో సెప్టెంబ‌ర్ 19 నుంచి న‌వంబ‌ర్ వ‌ర‌కు ఐపీఎల్ సీజ‌న్ నిర్వ‌హించ‌నున్న‌విష‌యం తెలిసిందే.

అవును. ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తి వ‌చ్చింది. లిఖిత పూర్వ‌కంగా ప‌త్రాలు మాకు అందాయి. ప్ర‌భుత్వ నుంచి హామీ అందిన వెంట‌నే లీగ్‌ను యూఏఈలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుకు స‌మాచార‌మిచ్చాం. ఇప్పుడు అధికారికంగా ప‌త్రాలు కూడా అందిస్తాం`అని సోమ‌వారం బ్రిజేశ్ ప‌టేల్ తెలిపారు.

ఇప్ప‌టికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు యూఏఈ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటుండ‌గా.. కొవిడ్‌-19 నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌ల మ‌ధ్యే లీగ్ నిర్వ‌హించాల‌ని మాజీ క్రికెట‌ర్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. యూఏఈ లో ఐపీయల్ జరుగుతుండటంతో అక్కడి పరిస్థితులపై అంతగా ఎవరికీ అవహగానా లేకపోవడంతో ఈ సారి ఐపీయల్ మీద అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి

Tags :
|
|

Advertisement