Advertisement

  • రియల్మి C12, C15 స్మార్ట్ఫోన్లు బడ్జెట్ ధరలో విడుదల

రియల్మి C12, C15 స్మార్ట్ఫోన్లు బడ్జెట్ ధరలో విడుదల

By: chandrasekar Wed, 19 Aug 2020 12:36 PM

రియల్మి C12, C15 స్మార్ట్ఫోన్లు బడ్జెట్ ధరలో విడుదల


మరో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్‌మి ఆవిష్కరించింది. రియల్‌మి C12, రియల్‌మి C15 పేర్లతో బడ్జెట్‌ ఫోన్లను విడుదల చేసింది.

రియల్‌మి ఫోన్లు 18W క్విక్‌ ఛార్జ్‌ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ, క్వాడ్‌ రియర్‌ కెమెరా సెటప్‌, వాటర్‌డ్రాప్‌ స్టైల్‌ డిస్‌ప్లే వంటి అద్భుత ఫీచర్లతో ‌ మార్కెట్లోకి వచ్చేశాయి.

రెండు ఫోన్లలో కూడా ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ ఫీచర్‌ ఉన్నది. నూతన మోడళ్లు రివర్స్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుండగా పవర్‌ బ్లూ, పవర్‌ సిల్వర్‌ కలర్లలో ఉన్నాయి.

భారత్‌లో రియల్‌మి సి12 3జీబీ + 32జీబీ స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 8,999 కాగా రియల్‌మి సి15 మోడల్‌ 3జీబీ + 32జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌ ధర రూ. 9,999 ఉంది.

4జీబీ + 64జీబీGB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్ ధర రూ. 10.999గా నిర్ణయించినట్లు కంపెనీ పేర్కొంది.

రియల్‌మి సి15 విక్రయాలు ఆగస్టు 27 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్‌లో ప్రారంభం కానున్నాయి. రియల్‌మి సి12 అమ్మకాలు ఆగస్టు 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి.కామ్‌లో దీని మొదటి అమ్మకం ఆగస్టు 24న ప్రారంభం కానుంది.

Tags :
|

Advertisement