Advertisement

  • రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ సీ15 సేల్ నేడే....

రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ సీ15 సేల్ నేడే....

By: chandrasekar Thu, 27 Aug 2020 3:56 PM

రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ సీ15 సేల్  నేడే....


మనదేశంలో మొదటిసారి ఈరోజు రియల్ మీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ సీ15 సేల్ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్, రియల్ మీ వెబ్ సైట్లలో ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ ఉంది. వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. దీంతో పాటు 6000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీని కూడా దీనిలో అందించడం జరిగింది.

రియల్ మీ సీ15 ధర


దీనిలో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.9,999గానూ, 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.10,999గానూ నిర్ణయించారు. పవర్ బ్లూ, పవర్ సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంది.

రియల్ మీ సీ15 స్పెసిఫికేషన్లు


ఇందులో 6.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. డిస్ ప్లే యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉండగా, స్క్రీన్ టు బాడీ రేషియో 88.7 శాతంగా ఉంది. ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ వెనకభాగంలో అందించారు.

ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 4 జీబీ వరకు ర్యామ్ ను అందించారు. ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.

వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్, 2 మెగా పిక్సెల్ రెట్రో షూటర్ లను కూడా ఇందులో అందించారు. సెల్ఫీల కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.

సెల్ఫీ కెమెరాలో ఏఐ బ్యూటీ, హెచ్ డీఆర్, పనోరమ, టైమ్ ల్యాప్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. దీని స్టోరేజ్ సామర్థ్యం 64 జీబీ వరకు ఉంది. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం. ఇందులో కూడా 6000 ఎంఏహెచ్ బ్యాటరీనే అందించారు.

18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత రియల్ మీయూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. 4జీ వోల్టే, వైఫై, బ్లూటూత్ 5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్ బీ పోర్టు కనెక్టివిటీ ఫీచర్లను కూడా ఇందులో ఉన్నాయి. దీని మందం 0.98 సెంటీమీటర్లుగా ఉండగా, బరువు 209 గ్రాములు.

Tags :
|

Advertisement