Advertisement

  • చిన్నారి ప్రాణాలు కాపాడటానికి సహాయం చేసిన రియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు

చిన్నారి ప్రాణాలు కాపాడటానికి సహాయం చేసిన రియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు

By: chandrasekar Tue, 01 Dec 2020 11:59 AM

చిన్నారి ప్రాణాలు కాపాడటానికి సహాయం చేసిన రియల్ సూపర్ స్టార్ మహేష్ బాబు


చాలామంది నిరుపేదలు వైద్య అవసరాలకు డబ్బులు లేక ఇబ్బంది పడుతుంటారు. చాలా మంది దగ్గర డబ్బులు ఉంటాయి కానీ సాయం చేసే గుణం మాత్రం చాలా తక్కువ మంది దగ్గరే ఉంటుంది. అలాంటి వాళ్లలో మహేష్ బాబు కూడా వున్నాడు. పిల్లల పట్ల సాయం చేయడంలో మహేష్ బాబు ఎప్పుడూ ముందే ఉంటాడు. చేసే సాయం అందరికి తెలియకుండా ఈ సూపర్ స్టార్ చూసుకుంటున్నాడు. అలా రియల్ హీరో అనిపించుకుంటున్నాడు మహేష్ బాబు. కష్టాల్లో వున్న నిరుపేద చిన్నారుల ప్రాణాలు కాపాడాడు. తాజాగా మరో చిన్నారికి కూడా ప్రాణదానం చేసాడు మహేష్. సేవాగుణంలో నిజమైన హీరో అనిపించుకున్నాడు. తాజాగా డింపుల్ అనే చిన్నారి వైద్య ఖర్చులన్నీ మహేష్ బాబు భరించాడు. అరుదైన కాల్సిఫైడ్ పల్మనరీ వాల్వ్ అనే వ్యాధితో బాధ పడుతున్న ఆ చిన్నారికి అండగా మహేష్ బాబు నిలిచాడు. ఇప్పటికే ట్రీట్మెంట్ ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ చిన్నారి కోలుకుందని ఆ చిన్నారికి, తన కుటుంబానికి తమ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్రత ఈ సందర్భంగా ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే ఒక్కరు ఇద్దరు కాదు 1010 మంది గుండె సంబంధిత వ్యాధులతో బాధ పడుతున్న చిన్నారులకు అవసరమైన సర్జరీలు మహేష్ బాబు చేయించాడు.

చాలామంది నిరుపేద చిన్నారులు తమ వివిధ రకాల వ్యాదుల నుండి బయటపడేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతుంటారు. పేద కుటుంబాల్లో వెలుగులు నింపడానికి అనారోగ్యంతో బాధ పడుతున్న చిన్నారులను బ్రతికించడానికి ఇతను ముందుకొస్తున్నాడు. ఈ సాయంలో కొన్ని హాస్పిటల్స్‌తో కూడా మహేష్ బాబు టై అప్ అయ్యాడు. వాళ్ల సహకారంతోనే ఇదంతా చేస్తున్నాడు. ఆంధ్రా హాస్పిటల్స్ సహకారంతో హెల్త్ చెకప్‌లు నిర్వహించడమే కాకుండా ఇప్పటి వరకు 1010 చిన్నారులకు ఎంతో క్లిష్టమైన గుండె సంబంధిత సర్జరీలను చేయించాడు. ఆ చిన్నారుల మొహాల్లో చిరునవ్వులు నింపడానికి తన వంతు కృషి చేస్తున్నాడు. తాజాగా డింపుల్ మాత్రమే కాదు ఈ మధ్యే భవ్యశ్రీ అనే చిన్నారికి వెంటనే హార్ట్ ఆపరేషన్ చేయాలని లేకపోతే పాప ప్రాణాలు కాపాడలేమంటూ మహేష్ బాబుకు నెటిజన్ రిక్వెస్ట్ పెట్టాడు. ఆ చిన్నారిని ఎలాగైనా కాపాడమని సోషల్ మీడియాలో మహేష్ బాబు సాయం కోరాడు. ఈ విషయాన్ని తన టీమ్ ద్వారా తెలుసుకున్న మహేష్ వెంటనే స్పందించి ఆ చిన్నారికి జూలై 17న విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో హార్ట్ సర్జరీ చేయించాడు. తద్వారా ప్రాణం కాపాడాడు. ఇప్పటి వరకు 1015 మంది చిన్నారులకు విజయవంతంగా గుండె సంబంధిత రోగాలు నయం చేయించాడు. పేదలకు సహాయం చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడాడు. ఇతను చేసిన మేలు మరవలేమని చాలా మంది చెపుతున్నారు.

Tags :
|

Advertisement